Shocking: స్కూలు గేట్ మూసేసి నిరసనకు దిగిన విద్యార్థులు.. అసలు కారణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-08-30T01:20:35+05:30 IST

తమ టీచర్‌ను బదిలీ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.. తమ పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు..

Shocking: స్కూలు గేట్ మూసేసి నిరసనకు దిగిన విద్యార్థులు.. అసలు కారణమేంటో తెలిస్తే..

తమ టీచర్‌ను బదిలీ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.. తమ పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు.. బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. విద్యార్థులకు తోడు గ్రామస్థులందరూ ఆ ధర్నాలో కూర్చుకున్నారు.. సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు, తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులు, విద్యార్థులను ఒప్పించారు.. వారి హామీ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాను విరమించి గేటు తాళం తెరిచారు.. రాజస్థాన్‌ (Rajasthan)లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

`అన్నయ్యా..` అని పిలిచే బాలికను లోబరుచుకుని అత్యాచారం.. చివరకు అతను ఎంతకు తెగించాడంటే..


బార్మర్‌లోని గిడా షాహీద్ స్కూల్‌లో రెండో తరగతి టీచర్‌ను బదిలీ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ పాఠశాలలో మొత్తం 450 మంది పిల్లలు ఉన్నారు. కేవలం 9 మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. 13 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న వారిలో ఇద్దరిని వేరే పాఠశాలకు అధికారులు బదిలీ చేశారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీని రద్దు చేయాలని సోమవారం పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు దిగారు.


గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. పాఠశాలలో నిరసన గురించి సమాచారం అందుకున్న తహశీల్దార్, విద్యాశాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. సుమారు మూడు గంటల పాటు ప్రయత్నించి అందరినీ ఒప్పించారు. కొద్ది రోజుల పాటు బదిలీలను ఆపుతామని చెప్పారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు శాంతించారు. 

Updated Date - 2022-08-30T01:20:35+05:30 IST