viral video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న అనకొండ వీడియో.. భయపడేవాళ్ళు చూడకండి

ABN , First Publish Date - 2022-11-11T11:14:50+05:30 IST

అనకొండ నిజంగా మనిషిని చంపడానికి ప్రయత్నిస్తే...

viral video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న అనకొండ వీడియో.. భయపడేవాళ్ళు చూడకండి

అనకొండ సినిమా చూశారా... ఆ సినిమాలో ఆ పెద్ద పాములు మనుషుల్ని చంపేతీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. వాటి వేగం, వాటి పరిమాణం, అవి మనుషుల్ని వెంటాడి మరీ చంపేతీరు ఇలా అనకొండను గుర్తు తెచ్చుకుంటే ఒళ్ళు గగుర్పాటుకు లోనవుతుంది. అదంతా గ్రాఫిక్స్ అయినా మనం భయపడతాం. మరి అలాంటి అనకొండ నిజంగా మనిషిని చంపడానికి ప్రయత్నిస్తే... ఏంటి నిజమైన అనకొండే.. అని నోళ్లు వెళ్ళబెడతారేమో.. కానీ నిజం. ఓ అనకొండను చేతుల్లో పట్టుకున్న వ్యక్తిని పలుమార్లు చంపడానికి ప్రయత్నించే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వెన్నులో వణుకు పుట్టించే ఈ వీడియో గురించి వివరాల్లోకి వెళితే...

నిక్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో అతను పెద్ద అనకొండను చేతుల్లో పట్టుకుని ఉండగా అది అతని చేతులను గట్టిగా చుట్టేయడం మనం చూడొచ్చు. అలాగే చేతిని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఒకటికి మూడు సార్లు కొరికి చంపడానికి ప్రయత్నించింది. అది పదే పదే అలా చేస్తుండటాన్ని నిక్ వీడియో తీసి మరీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. అనకొండలు విషరహితమైనవి అయినా అవి మనుషుల్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరాడనివ్వకుండా చేసి, చంపిన తర్వాత అమాంతం మింగేస్తుంటాయి.. ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో... అని నోర్లు వెళ్ళబెడుతున్నవాళ్లు కొందరైతే.. 'దాన్ని అమెజాన్ అడవుల్లో వదిలేయండి ఆడుకోవడానికి అది బొమ్మ కాదు' అని విమర్శలు గుప్పించినవాళ్శు కూడా ఉన్నారు. వీడియోలో ఆ అనకొండ సదరు వ్యక్తిని పలుమార్లు కొరికింది కానీ దానికి విషం ఉండదు కాబట్టి సరిపోయింది లేకపోతేనా... అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా నిక్ కు ధైర్యం చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అతనికి తన ప్రాణాల మీద తీపి తక్కువేమో..

Updated Date - 2022-11-11T11:14:57+05:30 IST