భర్త దూరమైనా కుంగిపోలేదు.. నలుగురు కుమార్తెలను పోషించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం.. అంతా శభాష్ అనేలా ఉంది..

ABN , First Publish Date - 2022-02-24T02:27:47+05:30 IST

పంజాబ్‌కు చెందన ఓ మహిళ కూడా వీరి జాబితాలోకే వస్తుంది. భర్త దూరమైనా కుంగిపోకుండా.. నలుగురు కుమార్తెలను పోషించడానికి ఆమె ఎన్నుకున్న మార్గం.. అందరి చేతా శభాష్ అనిపించేలా ఉంది..

భర్త దూరమైనా కుంగిపోలేదు.. నలుగురు కుమార్తెలను పోషించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం.. అంతా శభాష్ అనేలా ఉంది..

కొందరు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంటారు. పరీక్షలో ఫెయిల్ అయ్యాననో, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారనో, ప్రేమలో విఫలమయ్యాననో ఇలా చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. జీవితం ఎంతో విలువైనదన్న సత్యాన్ని కొందరు మాత్రమే గుర్తిస్తారు. అలాంటి వారు, జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి.. చివరకు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. పంజాబ్‌కు చెందన ఓ మహిళ కూడా వీరి జాబితాలోకే వస్తుంది. భర్త దూరమైనా కుంగిపోకుండా.. నలుగురు కుమార్తెలను పోషించడానికి ఆమె ఎన్నుకున్న మార్గం.. అందరి చేతా శభాష్ అనిపించేలా ఉంది.


పంజాబ్‌లోని అమృ‌త్‌సర్‌కు చెందిన వీణ అనే మహిళకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒకప్పుడు భర్త తోపుడు బండి మీద హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దురదృష్టవశాత్తు కొన్నేళ్ల క్రితం అతను మరణించాడు. ఒక్కసారిగా కుటుంబ పెద్ద దూరమవడంతో భార్య, పిల్లలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే వీణ మాత్రం కుంగిపోలేదు. ఎలాగైనా తన పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. బాగా ఆలోచించి కొన్ని రోజుల తర్వాత భర్త నడిపిన తోపుడు బండిపైనే వ్యాపారం చేయడం మొదలెట్టింది. మొదట్లో చుట్టుపక్కల వారు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగించింది. రద్దీగా ఉండే ప్రదేశంలో బండి పెట్టుకుని, పెద్ద సైజున్న స్పెషల్ పరోటాను రూ.30కి విక్రయించడం మొదలెట్టింది.

ట్యూషన్‌కు వచ్చిన బాలికను టార్గెట్ చేసిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో ఇలా చేస్తాడని ఊహించలేదు..


నాణ్యత, రుచిలో రాజీపడకుండా చేస్తుండడంతో ఆమె పరోటాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆనోటా, ఈనోటా ప్రచారం కావడంతో జనం క్యూకట్టడం మొదలెట్టారు. గౌరవ్ వాసన్ అనే ఫుడ్ బ్లాగర్.. ఈమె గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఈమె స్ఫూర్తిదాయకమైన కథను తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. హోటల్ వ్యాపారం చేయకముందు ఆమె.. పిల్లల పోషణార్థం ఇళ్లలో పనులు కూడా చేసిందని పేర్కొన్నాడు. పట్టుదలతో పని చేసి సాటి మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోదంటూ ప్రస్తుతం స్థానికులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మహిళ పట్టదల భేష్.. అంటూ అపర్శక్తి ఖురానా అనే నటుడు కూడా అభినందిస్తూ కామెంట్ చేశారు.

పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. భర్త బతిమిలాడినా నో రెస్పాన్స్.. ఆమె చెప్పింది విని..

Read more