కూతురిపై అత్యాచారం.. కేసు పెట్టిన 2 నెలలకు ఆ తండ్రి దారుణ హత్య.. ఎవరిపై కేసు పెట్టాడో వాళ్లింటికి వెళ్తే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-10-06T17:56:12+05:30 IST

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అత్యాచార బాధితురాలి తండ్రిని...

కూతురిపై అత్యాచారం.. కేసు పెట్టిన 2 నెలలకు ఆ తండ్రి దారుణ హత్య.. ఎవరిపై కేసు పెట్టాడో వాళ్లింటికి వెళ్తే షాకింగ్ ట్విస్ట్..!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అత్యాచార బాధితురాలి తండ్రిని హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు తన సహచరుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన తండ్రిపై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేయడం, ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన నిందితుడు ప్రతీకారంతో ఈ హత్యకు పాల్పడ్డాడు. అరెస్ట్ చేసిన నిందితులిద్దరినీ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తు అధికారి, ఎస్సీ-ఎస్టీ సెల్ డీఎస్పీ రమావతార్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ధనోప్ మాతా వద్దకు వెళ్లినట్లు తెలుసుకున్న, అమర్‌పురా నివాసి కైలాష్ గుర్జార్ (32), అతని సహచరుడు బగ్రాయ్ నివాసి సజ్జన్ జాట్ (39) కలిసి దారిలో అతనిని పదునైన ఆయుధంతో హత్య చేశారు.  


మృతుని బంధువుల తరపున అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను విచారించగా వారు నేరం అంగీకరించారు. వారు వినియోగించిన కారు, కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనాక్రమం ఇదే...

అజ్మీర్‌లోని భినయ్ సబ్‌డివిజన్‌లోని గ్రామ పంచాయతీ గుడ్డా ఖుర్ద్‌కు చెందిన బాగ్రాయ్ గ్రామ పచ్చిక బయళ్లలో 35 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అక్కడికి సమీపంలోని గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి ఒంటిపై పదునైన ఆయుధంతో నరికిన గుర్తులు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో పోలీసులు ప్రాథమికంగా హత్య కేసుగా పరిగణించి, దర్యాప్తు ప్రారంభించారు.

జూలై 26, 2021న మృతుడి మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసు నమోదు కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.  నెల రోజుల తర్వాత అత్యాచార నిందితుడు శ్రవణ్ విషం తాగాడు. జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు  తమకు 80 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇందుకు కారకులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి గ్రామస్తులు అంగీకరించారు. తాజాగా జరిగిన హత్య కేసులో పోలీసులు నిందితులను విచారించగా, వారు నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

Read more