Viral News: వ్యక్తికి పాముకాటు.. అనంతరం అతడు చేసిన పని చూసి పరుగులు తీసిన వైద్యులు!

ABN , First Publish Date - 2022-07-29T13:49:00+05:30 IST

అతడు ఒక రైతు. ఎప్పటిలాగే ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పొలంలో దిగి పనులు చేస్తుండగా.. అతడిని పాము కాటేసింది. అది గమనించిన అతడు.. ఆసుపత్రికి పరుగులు తీశాడు. దీంతో వైద్యులు అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. చికిత్స

Viral News: వ్యక్తికి పాముకాటు.. అనంతరం అతడు చేసిన పని చూసి పరుగులు తీసిన వైద్యులు!

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఒక రైతు. ఎప్పటిలాగే ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. పొలంలో దిగి పనులు చేస్తుండగా.. అతడిని పాము కాటేసింది(Snake Bite). అది గమనించిన అతడు.. ఆసుపత్రికి పరుగులు తీశాడు. దీంతో వైద్యులు అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. చికిత్స మొదలు పెట్టే సమయానికి అతడు చేసిన పిచ్చి పనితో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పరుగులు తీశారు. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


బిహార్ షరీఫ్ ప్రాంతానికి చెందిన సురేంద్ర ప్రసాద్ (Surendra Prasad) అనే యువకుడు స్థానిక ఆసుపత్రిలో చేసిన పచ్చి పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటిలాగే గురువారం రోజు పొలానికి వెళ్లిన అతడిని పాము కాటేసింది. ఈ నేపథ్యంలో అతడు భయాందోళనలకు గురవ్వకుండా ధైర్యాన్ని ప్రదర్శించాడు. పారిపోతున్న పామును పట్టుకుని.. బంధించాడు. తన దగ్గర ఉన్న సంచీలో దాన్ని పెట్టుకుని నేరుగా ఆసుపత్రి(Hospital)కి వెళ్లాడు. అక్కడి వైద్యులకు విషయం చెప్పి, చికిత్స చేయమని కోరాడు. డాక్టర్లు చికిత్స ప్రారంభించే సమయంలో తనను కాటేసిన పామును సంచీలోంచి బయటకు తీసి చూపించాడు. 



దీంతో ఒక్కసారిగా వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు ఆసుపత్రిలోని ఇతర పేషెంట్లు దూరంగా పరుగులు తీశారు. డాక్టర్ల సలహా మేరకు సురేంద్ర ప్రసాద్ ఆ పామును తిరిగి సంచీలో బంధించాడు. ఈ నేపథ్యంలో వైద్యులు(Doctors) అతడికి చికిత్స చేసి, ఇంటికి పంపించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన యువకుడు.. ‘చికిత్స సందర్భంగా వైద్యులు ఏ పాము కటేసిందని ప్రశ్నిస్తారు కదా.. అందుకే వారికి చూపిద్దామని పామునే నేరుగా ఆసుపత్రికి పట్టుకొచ్చాను’ అని బదులిచ్చాడు. 


Updated Date - 2022-07-29T13:49:00+05:30 IST