ఫోన్లు తెస్తున్నారని క్లాసుల్లో చెకింగ్.. 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లోంచి ఏం బయటపడ్డాయంటే..

ABN , First Publish Date - 2022-11-30T18:21:04+05:30 IST

కరోనా తర్వాత చాలా మంది విద్యార్థులు వాటికి అలవాటు పడిపోయారు. పాఠశాలల్లోకి కూడా ఫోన్లను పట్టుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు.. 8,9,10 విద్యార్థుల బ్యాగులను చెక్ చేశారు. అనంతరం వారి బ్యాగుల్లోంచి బయటపడిన వాటిని చూసి టీచర్లు..

ఫోన్లు తెస్తున్నారని క్లాసుల్లో చెకింగ్.. 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లోంచి ఏం బయటపడ్డాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా తర్వాత చాలా మంది విద్యార్థులు వాటికి అలవాటు పడిపోయారు. పాఠశాలల్లోకి కూడా ఫోన్లను పట్టుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు.. 8,9,10వ తరగతుల విద్యార్థుల బ్యాగులను చెక్ చేశారు. అనంతరం వారి బ్యాగుల్లోంచి బయటపడిన వాటిని చూసి టీచర్లు కంగుతిన్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోకి సెల్‌ఫోన్లను పట్టుకెళ్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కర్ణాటకలోని ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ మేనేజ్‌మెంట్(KAMS) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సిటీలోని పాఠశాలల్లో(Bengaluru Schools).. 8,9,10వ తరగతులు చదువుతున్న విద్యార్థుల బ్యాగులను తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే దాదాపు 80శాతం స్కూల్స్‌లో ఉపాధ్యాయులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఈ తనిఖీల్లో బయటపడిన వాటిని చూసి ఉపాధ్యాయులు ఒక్కసారిగా షాకయ్యారు.

విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్లు, లైటర్లు, ఆల్కహాల్ బాటిల్, గర్భనిరోధక మాత్రలను గుర్తించిన ఉపాధ్యాయులు కంగుతిన్నారు. ఈ విషయాన్ని KAMS జనరల్ సెక్రటరీ డి. శశికుమార్ తాజాగా వెల్లడించారు. ఒక పాఠశాల విద్యార్థిని బ్యాగులో కండోమ్ బయటపడగా.. ఆమె తన స్నేహితులపై ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. ఇక మరో పాఠశాలలోని విద్యార్థిని బ్యాగులో గర్భనిరోధక మాత్రను ఉపాధ్యాయులు గుర్తించినట్టు చెప్పారు. ఒక విద్యార్థి వద్ద వాటర్ బాటిల్‌లో ఆల్కహాల్‌ను ఉపాధ్యయులు కనుగొన్నట్టు వెల్లడించారు. ఈ విషయాలు తెలియగానే షాక్‌కు గురైనట్టు తెలిపారు.

కాగా.. ఈ విషయాన్ని సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తెలియజేసినట్టు పాఠశాలల ప్రిన్సిపాల్ చెప్పారు. తాము చెప్పింది విని.. తల్లిదండ్రులు షాకయ్యారని పేర్కొన్నారు. అయితే.. విద్యార్థులకు కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేసి, వాళ్లు ఈ అలవాట్ల నుంచి బయటపడేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించినట్టు పేర్కొన్నారు. అందుకోసం దాదాపు 10రోజుల సెలవులను కూడా మంజూరు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని సస్పెండ్ చేయలేదని వివరించారు.

ఇదిలా ఉంటే.. విద్యార్థుల వద్ద కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు(condoms, cigarettes, contraceptives) తదితరాలు లభించడం పట్ల మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 14ఏళ్ల ఓ అబ్బాయి షూ ర్యాక్‌లో కండోమ్‌ను గుర్తించిన ఓ తల్లికి సంబంధించిన కేసును ప్రస్తావిస్తూ.. ఆ వయసులోని కొందరు పిల్లలు ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే మందు, సిగరెట్లతోపాటు అసాంఘిక కార్యకాలపాలవైపు ఆకర్షితులవుతారని వెల్లడించారు. పిల్లలు ఆ బాట పట్టకుండా గైడ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉందని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2022-11-30T18:37:38+05:30 IST

Read more