Viral News: మహిళకు వింత అనుభవం.. స్పైసీ ఫుడ్ తింటే.. ఎముకలు విరిగిపోయాయి!

ABN , First Publish Date - 2022-12-08T16:11:14+05:30 IST

ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. స్పైసీ ఫుడ్ కారణంగా ఆమె శరీరంలోని విరిగిపోయాయి. అయితే.. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. ఆమెకు సంబంధించిన వార్త..

Viral News: మహిళకు వింత అనుభవం.. స్పైసీ ఫుడ్ తింటే.. ఎముకలు విరిగిపోయాయి!

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. స్పైసీ ఫుడ్ కారణంగా ఆమె శరీరంలోని విరిగిపోయాయి. అయితే.. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. ఆమెకు సంబంధించిన వార్త మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. కాగా.. స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎముకలు ఎలా విరిగిపోయాయి? అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

చైనాకు చెందిన హుయాంగ్ అనే మహిళ ఇటీవల స్పైసీ ఫుడ్‌ను తినింది. ఘాటు కారణంగా ఆహారం తినే సమయంలో ఆమెకు విపరీతమైన దగ్గు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఛాతి భాగంలో శబ్దాలు వచ్చాయి. తొలుత దాన్ని ఆమె లైట్‌గా తీసుకుంది. కానీ కాలం గడిచే కొద్ది.. ఆమె ఛాతిలో నొప్పి రావడంతో తాజాగా వైద్యులను సంప్రదించింది. దీంతో ఆమెకు డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె ఛాతి భాగంలో నాలుగు ఎముకలు విరిగినట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. దీంతో సదరు మహిళ కంగుతింది. ఈ క్రమంలో కోలుకోవడం కోసం హుయాంగ్‌కు చికిత్స అందజేసిన వైద్యులు.. కొన్ని రోజులపాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఆమెను కోరారు.

కాగా.. ఈ ఘటనపై స్పందించిన డాక్టర్లు.. హుయాంగ్ ఛాతిలో ఎముకలు విరగడానికి గల కారణాలను వెల్లడించారు. హుయాంగ్ 171 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పటికీ కేవలం 57 కిలో బరువు మాత్రమే ఉందని చెప్పారు. ఆమె బాగా సన్నగా ఉండటం మూలాన.. ఎముకలకు కండరాల సపోర్ట్ లేదని తెలిపారు. అందువల్లే విపరీంగా దగ్గినప్పుడు.. ఛాతిలోని ఎముకల్లో పగుళ్లు వచ్చినట్టు వివరించారు.

Updated Date - 2022-12-08T16:18:05+05:30 IST