-
-
Home » Prathyekam » African Man Has 15 Wives 107 Children prvn spl-MRGS-Prathyekam
-
Viral News: ఇప్పటికే 15 మంది భార్యలు.. 107 మంది పిల్లలు.. మరిన్ని పెళ్లిళ్లకూ రెడీ అంటున్న మహానుబావుడు!
ABN , First Publish Date - 2022-09-11T19:11:06+05:30 IST
పెళ్లి కాని యువకులు.. ‘మాకు అసలే ఒక్క పెళ్లి కూడా కాలేదని’ సరదాగా మాట్లాడుకుంటుంటారు. కానీ పెళ్లైన వాళ్లు మాత్రం.. ‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అంటూ హితబోధ చేస్తుంటారు. సంసార కడ

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి కాని యువకులు.. ‘మాకు అసలే ఒక్క పెళ్లి కూడా కాలేదని’ సరదాగా మాట్లాడుకుంటుంటారు. కానీ పెళ్లైన వాళ్లు మాత్రం.. ‘వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అంటూ హితబోధ చేస్తుంటారు. సంసార కడలిలో ఈదడం చాలా కష్టమని చెబుతుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం.. ఇప్పటికే 15 పెళ్లిళ్లు చేసుకుని, 107 మంది పిల్లలకు తండ్రైనా.. మరిన్ని వివాహాలు చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఇంతకూ ఆ మహానుబావుడు ఎవరు? ఎందుకు మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవాలని ఎదురుచూస్తున్నాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
కెన్యా(Kenya)లోని మారుమూల గ్రామానికి చెందిన అతడి పేరు డేవిడ్ సకాయో కలుహానా(David Sakayo Kaluhana). ఇతడికి ప్రస్తుతం 61ఏళ్లు. డేవిడ్ ఇప్పటి వరకు 15 మంది మహిళలను పెళ్లాడి.. 107 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. అంతేకాదండోయ్.. ఇతడు వాళ్లందరితో ప్రశాంత జీవనం గడుపుతున్నాడు. ఇతడి భార్యలు కూడా డెవిడ్‌ను ఓ రాజులా భావిస్తున్నారు.
కాగా.. డేవిడ్ ఇప్పటి వరకు 4వేల పుస్తకాలను చదివాడట. అతడు తనకు IQ ఎక్కువ అని చాలా బలంగా నమ్ముతున్నాడు. ఒక భార్య తన తెలివి తేటలను అర్థం చేసుకోలేదని అతడి భావన. అంతేకాకుండా ఆయన 1000 మంది భార్యలు గల Solomon (సాల్మన్) రాజును ఆదర్శంగా తీసుకున్నాడట. తాను కూడా ఆ రాజు కంటే తక్కువకాదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 15 పెళ్లిళ్లు చేసుకున్నాడట. ఇకపై కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట. అతడి భార్యలు అందరూ పనులను షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారట.
‘డేవిడ్ మరొక మహిళను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేనేమీ బాధ, ఈర్ష పడలేదు. బాధ్యతలు తెలిసిన వ్యక్తి ఆయన. ఏదైనా చేసేముందు చాలా సమయం ఆలోచించైనా సరే సరైన నిర్ణయం తీసుకుంటారు’ అని డేవిడ్ మొదటి భార్య జెస్సికా అంటున్నారు. డేవిడ్ ఏడవ భార్య కూడా ఇదే చెప్పారు. అందరూ కలిసి ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా ఓ సంస్థ తీసిన డాక్యుమెంటరీ ద్వారా డేవిడ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.