రిసెప్షెన్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. యాక్టింగ్ కావొచ్చనుకున్న బంధువులు.. కానీ..

ABN , First Publish Date - 2022-01-23T21:48:32+05:30 IST

అతడికి 30ఏళ్లు. బంధువుల పెళ్లికి కుటుంబ సమేతంగా వేళ్లాడు. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షెన్‌లో సందడి చేశాడు. డ్యాన్స్ ద్వారా అందరినీ ఉత్సాహ పరుస్తూ.. అకస్మాత్తుగా స్టేజీపై కుప్పకూలాడు.

రిసెప్షెన్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. యాక్టింగ్ కావొచ్చనుకున్న బంధువులు.. కానీ..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 30ఏళ్లు. బంధువుల పెళ్లికి కుటుంబ సమేతంగా వేళ్లాడు. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షెన్‌లో సందడి చేశాడు. డ్యాన్స్ ద్వారా అందరినీ ఉత్సాహ పరుస్తూ.. అకస్మాత్తుగా స్టేజీపై కుప్పకూలాడు. దీంతో అతడు యాక్టింగ్ చేస్తున్నాడని తొలుత అందరూ భావించారు. కానీ తర్వాత నిజం తెలుసుకుని షాకయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ప్రాంతానికి చెందిన అనంత్(30).. శుక్రవారం రోజు తన బంధువు పెళ్లికి కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. ఆ తర్వాత అటునుంచి అటే బంధువులతో కలిసి జామున్ ధన‌ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన రిసెప్షెన్‌లో సందడి చేస్తూ తిరిగాడు. స్టేజిపైకి ఎక్కి డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో స్టేజిపై అకస్మాత్తుగా కుప్పకూలాడు. దీంతో అనంత్ యాక్టింగ్ చేస్తున్నాడని అక్కడున్న వారందరూ తొలుత భావించారు. అయితే ఎంతకూ లేవకపోవడంతో.. కంగారు పడ్డారు. వెంటనే స్టేజిపైకి వెళ్లి అతడిని లేపేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అనంత్‌ను పరిక్షీంచిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల అనంత్ చనిపోయాడని పేర్కొన్నారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. అనంత్‌కు 5ఏళ్ల కూతురు ఉన్నట్టు సమాచారం.


Read more