పోలీస్ స్టేషన్‌కు పదా.. అంటూ ఆటో ఎక్కిన మహిళ.. దారి మధ్యలో వెనుక నుంచి ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2022-08-29T01:25:39+05:30 IST

ఆమెకు వివాహమై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి.. లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంది. ఇప్పటిదాకా బాగా ఉన్న ఆమె ప్రవర్తనలో ఇటీవల మార్పు..

పోలీస్ స్టేషన్‌కు పదా.. అంటూ ఆటో ఎక్కిన మహిళ.. దారి మధ్యలో వెనుక నుంచి ఆమె చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు వివాహమై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి.. లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంది. ఇప్పటిదాకా బాగా ఉన్న ఆమె ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి భర్త, పిల్లలను వదిలి ఏకాంతంగా ఉంటోంది. అయినా ఆమె మాత్రం తన పద్ధతిని మార్చుకోలేదు. చివరకు ప్రియుడి ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పింది. దారి మధ్యలో వెనుక నుంచి ఆమె చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..


ముంబైలో (Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మహిళకు భర్త, ఆరుగురు పిల్లలు ఉన్నారు. మొన్నటిదాకా వీరి కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయితే ఇటీవల ఆమెకు రంజాన్ షేక్ అనే ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు వారి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తకు తెలీకుండా అతడితో కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో వారి విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇటీవల ఆమె.. భర్తను, పిల్లలను వదిలి వేరే ప్రాంతంలో ఒంటరిగా ఉంటోంది. అప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.

విద్యార్థుల ముందే బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..


మళ్లీ ప్రియుడు వద్దకు వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇందుకు అతను అంగీకరించడంతో ఇద్దరూ కలిసి సహజీవనం (Live in relationship) చేయడం మొదలెట్టారు. అయితే పెళ్లి విషయంలో వారి మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి విషయం వచ్చినప్పుడల్లా.. యువకుడు దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో ఇటీవల ఆమె గట్టిగా నిలదీయడంతో చేసుకోనని తెగేసి చెప్పాడు. అప్పటి నుంచి ప్రియుడిపై కోపం పెంచుకుంది. ఇటీవల ఓ రోజు ప్రియుడి వద్దకు వెళ్లి.. తనను పోలీస్ స్టేషన్ వద్ద దింపమంటూ వేడుకుంది. దారి మధ్యలో వెనుక నుంచి ఒక్కసారిగా కత్తితో అతడి గొంతు కోసింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

tragic incident: తాగుతూ తూలుతూ ఇంటికొచ్చిన భర్త.. అర్ధరాత్రవుతున్నా పదే పదే ఒకే విషయంలో భార్య వ్యతిరేకిస్తుండడంతో.. చివరకు..Read more