అతడు కాదు.. ఆమె.. 30 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకిలా చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-13T02:07:47+05:30 IST

తమిళనాడుకు చెందిన మహిళకు ప్రస్తుతం 57ఏళ్లు. ఆమె తన జీవిత కాలంలో 30ఏళ్లపాటు పురుషుడుగానే జీవించింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. ఒక మహిళ అయిండి ఇంత కాలం

అతడు కాదు.. ఆమె.. 30 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకిలా చేసిందో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడుకు చెందిన మహిళకు ప్రస్తుతం 57ఏళ్లు. ఆమె తన జీవిత కాలంలో 30ఏళ్లపాటు పురుషుడుగానే జీవించింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది నిజం. కాగా.. ఒక మహిళ అయిండి ఇంత కాలం పురుషుడిగా ఎందుకు జీవించింది. ఇపుడు ఎందుకు తన రహస్య జీవితం నుంచి బయటకు వచ్చింది. ఇంతకూ ఆమె ఎవరు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని కటునాయకన్‌పట్టి (Katunayakkanpatti)‌కి వెళ్లి ముత్తు మాస్టర్ గురించి అడిగితే.. ఎవ్వరైనా సరే పురుషుడు అనే చెబుతారు. కానీ వాస్తవం ఏంటంటే.. ముత్తు మాస్టర్ ఒక మహిళ. 20ఏళ్ల వయసులో గర్భం దాల్చిన తర్వాత భర్తను కోల్పోయిన ఆమె.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన ఐడెంటిటీని మార్చుకుంది. తనకు పుట్టిన ఆడ శిశును పోషించుకోవడం కోసం వెంట్రుకలను కట్ చేసుకోవడమే కాకుండా లుంగీ, షర్ట్ ధరించి ఒక పురుషుడిలా మారిపోయింది. పురుషులు చేసే కఠినమైన పనులు చేస్తూ కూతురిని పోషించుకుంది. టీ, పరోటా షాపులలో పని చేస్తూ కన్నబిడ్డ‌ను పెంచి పెద్ద చేసింది. అయితే దాదాపు 30ఏళ్ల పాటు ఒక పరుషుడిగా జీవించిన ఆమె.. తన రహస్య జీవితం నుంచి తాజాగా బయటకు వచ్చింది. 



వయసు మీద పడటంతో కఠినమైన పనులు చేయలేక.. ప్రభుత్వం అందించే వితంతు పెన్షన్ తన ఐడెంటిటీని బయటపెట్టింది. తనకు పెన్షన్ అందించి సహాయం చేయాలని అధికారులను అభ్యర్థిస్తోంది. అయితే.. ఆమె దగ్గర భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేకపోవడం.. ఆధార్ కార్డుపై ఆమె ఐడెంటిటీ పురుషుడుగా ఉండటంతో ప్రభుత్వం అందించే సహాయం అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా ముత్తు కూతురు మాట్లాడుతూ.. ‘నా కోసం మా అమ్మ ఎన్నో త్యాగాలు చేసింది. ఎంతో శ్రమించి నన్ను పెంచి పెద్ద చేసింది’ అంటూ భావోద్వేగానికి లోనైంది. మరో మహిళ మాట్లాడుతూ.. ముత్తు పురుషుడు కాదు మహిళ అనే విషయం తనతోపాటు ముత్తు కూతురుకి మరో ఇద్దరికి మాత్రమే తెలుసని పేర్కొంది. 

Read more