Viral Video: రూటు మార్చిన కొండముచ్చు.. విద్యార్థుల పక్కన కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

ABN , First Publish Date - 2022-09-18T02:18:31+05:30 IST

విచిత్రంగా ప్రవర్తించే కోతులు (Monkeys), కొండముచ్చుల (langur) గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ఫోన్లను లాక్కునే కోతులను చూశాం, ఫొటోలకు ఫోజులిచ్చే కోతులను చూశాం...

Viral Video: రూటు మార్చిన కొండముచ్చు.. విద్యార్థుల పక్కన కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

విచిత్రంగా ప్రవర్తించే కోతులు (Monkeys), కొండముచ్చుల (langur) గురించి అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ఫోన్లను లాక్కునే కోతులను చూశాం, ఫొటోలకు ఫోజులిచ్చే కోతులను చూశాం, అలాగే అచ్చం మనిషిలా ప్రవర్తించే కోతులను, కొండముచ్చులను కూడా చూశాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే కొండముచ్చు ఇందుకు పూర్తి విరుద్ధం. తాను మిగతా కొండముచ్చులా కాదు... నా రూటే సపరేటు.. అని నిరూపిస్తోంది. పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లిన కొండముచ్చును చూడగానే విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. అయితే కొండముచ్చు మాత్రం ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండా వారి పక్కనే బుద్ధిగా కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


జార్ఖండ్‌లోని (Jharkhand) హజారి‌బాగ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాసులో టీచర్ పాఠాలు చెబుతుండగా.. ఉన్నట్టుండి ఓ కొండముచ్చు లోపలికి ప్రవేశించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే కొండముచ్చు మాత్రం ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. ‘‘ఏం భయపడొద్దు.. నేను మిమ్మల్ని ఏమీ చేయను.. దయచేసి నన్ను కూడా మీతో పాటూ చదువుకోనివ్వండి’’.. అన్నట్లు మెల్లగా వారి వద్దకు వెళ్లింది. ముందు భయపడ్డ విద్యార్థులు.. తర్వాత దాని ప్రవర్తన చూసి హమ్మయ్య అనుకుంటూ కూర్చున్నారు. విద్యార్థులు పాఠాలు వింటుంటే.. కొండముచ్చు కూడా వారి వెనుకే కూర్చుని ఆసక్తిగా గమనిస్తూ ఉంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ కొండముచ్చుకు చదువుకోవాలని ఆశ పుట్టింది.. అంటూ కొందరు, గుడ్ స్టూడెంట్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

యువతిని కొట్టి, దుస్తులు ఊడదీసి మరీ వీడియో తీసిన యువకులు.. చివరకు జేసీబీలతో వెళ్లిన అధికారులు.. 





Updated Date - 2022-09-18T02:18:31+05:30 IST