Anand Mahindra Tweet: ‘‘టికెట్ లెస్ ట్రావెల్’’ అంటే ఏంటో తెలుసా? ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..

ABN , First Publish Date - 2022-09-08T21:10:50+05:30 IST

సోషల్ మీడియాలో (Social media) పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి విభిన్నమైన వీడియోలను..

Anand Mahindra Tweet: ‘‘టికెట్ లెస్ ట్రావెల్’’ అంటే ఏంటో తెలుసా? ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..

సోషల్ మీడియాలో (Social media) పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి విభిన్నమైన వీడియోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతా (Anand Mahindra Tweet) ద్వారా షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన బాతుల వీడియో.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇండియాలో దీన్ని ticket-less travel అని అంటారంటూ ఆయన వీడియోను షేర్ చేశారు.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ తల్లి బాతును పిల్ల బాతులు అనుసరిస్తూ వెళ్తుంటాయి. తల్లి బాతుపై ఓ పిల్ల బాతు తాపీగా కూర్చుని ప్రయాణం చేస్తుండగా.. మరో ఎనిమిది పిల్లలు.. తల్లి వెనుకే వరుసక్రమంగా వెళ్తుంటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.  చూడముచ్చటగా ఉందని కొందరు అంటుండగా, ఎంతో సౌకర్యవంతమైన ప్రయాణం.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ లుక్కేయండి మరి.

Viral Video: డాగ్ షోకు వచ్చిన చిన్నారిని చూసి చలించిపోయిన జడ్జి.. చివరకు బాలిక కుక్కను చూసి.. అంతా అయ్యో పాపం..! అంటూ..





Read more