Bullfight in wedding procession: పెళ్లి ఊరేగింపులోకి దూసుకొచ్చిన ఎద్దులు.. ఒక్కసారిగా ఆడవారి పైకి దూసుకెళ్లడంతో...

ABN , First Publish Date - 2022-07-28T03:08:40+05:30 IST

శుభకార్యాల సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అప్పుడప్పుడూ ఇవి విషాదాంతం అవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social media) లో...

Bullfight in wedding procession: పెళ్లి ఊరేగింపులోకి దూసుకొచ్చిన ఎద్దులు.. ఒక్కసారిగా ఆడవారి పైకి దూసుకెళ్లడంతో...

శుభకార్యాల సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అప్పుడప్పుడూ ఇవి విషాదాంతం అవుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social media) లో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ (viral) అవుతోంది. శుభమా అంటూ జరుగుతున్న పెళ్లి ఊరేగింపు (Wedding procession) లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంతా డ్యాన్సులు వేసుకుంటూ ఆనందంగా వెళ్తుండగా.. రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ ఒక్కసారిగా అక్కడికి దూసుకొస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీలో (Delhi) జరిగిన పెళ్లి ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన పెళ్లి ఊరేగింపులో బంధువులు, సన్నిహితులు, అతిథులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మగవారు ఓ వైపు డప్పు చప్పుళ్లకు నృత్యం చేస్తుండగా, మరోవైపు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా గమనిస్తుంటారు. అదే సమయంలో రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ వేగంగా ఊరేగింపులోకి వస్తాయి. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతారు. అంతలోనే అక్కడే ఉన్న మహిళల పైకి దూసుకెళ్తాయి.

Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..


ఈ ఘటనలో ఓ మహిళ ఎద్దుల కింద పడిపోతుంది. దీంతో అక్కడే ఉన్న వారు ఆమెను కాపాడి, పక్కకు తీసుకెళ్తారు. ఎద్దులు పోట్లాడుకుంటూ అటు నుంచే అటే దూరంగా వెళ్లిపోతాయి. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను అక్కడి భవనాల మీద ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. శుభమా.. అంటూ పెళ్లి చేసుకుంటుంటే పాపం ఇలా జరిగిందేంటీ... అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: సముద్రం మీదుగా వెళ్తున్న పైలట్‌‌కు షాకింగ్ అనుభవం.. ఎర్రటి మచ్చలు చూసి షాకవుతున్న నెటిజన్లు..





Updated Date - 2022-07-28T03:08:40+05:30 IST

Read more