-
-
Home » Prathyekam » A video of a young mans Stunt during Vinayaka festival is going viral kjr spl-MRGS-Prathyekam
-
Viral Video: ఇలాంటివి జరుగుతాయనే.. నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.. అని చెప్పేది..
ABN , First Publish Date - 2022-09-03T03:23:09+05:30 IST
కొందరు అందరిలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి.. ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు...

కొందరు అందరిలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి.. ప్రమాదకరమైన విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అందరిలో హీరో అవుదామని ట్రై చేసి, చివరకు జీరో అవుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువకుడు అందరిముందు హీరో అవుదామనే ఉద్దేశంతో చివరకు షాక్ అవుతాడు. టైం బాగుండడంతో చివరకు క్షేమంగా బయటపడతాడు.
సూరత్‌లోని పర్వత్ పాటియా ప్రాంతంలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జనం గుంపులు గుంపులుగా గుమికూడి ఉంటారు. వారి మధ్య ఓ యువకుడు ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. నోట్లో పెట్రోల్ పోసుకుని గాల్లో మంటలు పుట్టించే విన్యాసం చేయాలని ప్రయత్నిస్తాడు. అనుభవం లేకపోయినా.. ఎలాగైనా చేసి చూపించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో పెట్రోల్ బయటికి ఊసేసి, అగ్గి వెలిగిస్తాడు. కానీ అది వికటించడంతో మంటలు రివర్స్ అయి.. తిరిగి అతడికే అంటుకుంటాయి. దీంతో వాటిని ఆర్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. పక్కనే ఉన్న వారు చొరవ తీసుకుని, మంటలను ఆర్పివేస్తాడు. దీంతో స్వల్వ గాయాలతో బయటపడతాడు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.