Viral Video: ఆవేశంగా చెట్టెక్కిన సింహం.. పాపం దిగేటప్పుడు ఇలా అవుతుందని దానికేం తెలుసు..

ABN , First Publish Date - 2022-08-22T03:21:44+05:30 IST

వేటాడే క్రమంలో పులులు, సింహాలకు (wild animals) చివరకు ఒక్కోసారి చుక్కలు కనిపిస్తుంటాయి. వేట చిక్కకపోగా అసలుకే ఎసరు వచ్చినట్లు అవుతుంటుంది. కొన్నిసార్లు చిన్న..

Viral Video: ఆవేశంగా చెట్టెక్కిన సింహం.. పాపం దిగేటప్పుడు ఇలా అవుతుందని దానికేం తెలుసు..

వేటాడే క్రమంలో పులులు, సింహాలకు (wild animals) చివరకు ఒక్కోసారి చుక్కలు కనిపిస్తుంటాయి. వేట చిక్కకపోగా అసలుకే ఎసరు వచ్చినట్లు అవుతుంటుంది. కొన్నిసార్లు చిన్న జంతువులను వేటాడే సమయంలోనూ చివరకు పరాజయం ఎదురవుతుంటుంది. సోషల్ మీడియా (Social media) అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ సింహం కోతిని వేటాడే క్రమంలో ఆవేశంగా చెట్టు ఎక్కుతుంది. కానీ దిగే క్రమంలో తికమకపడుతుంది. చివరకు పైనుంచి సడన్‌గా కింద పడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో సింహానికి సంబంధించిన ఓ వీడియో (Lions video) వైరల్ అవుతోంది. కోతులను వేటాడే క్రమంలో ఓ సింహం.. ఆవేశంగా చెట్టెక్కుతుంది. పైన కోతిని చంపి తాపీగా ఆకలి తీర్చుకుంటుండగా.. కళేబరం కింద పడిపోతుంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన సింహం.. కిందకు దిగి దాన్ని తినాలని ప్రయత్నిస్తుంది. అయితే దిగే క్రమంలో తికమకపడుతుంది. చివరకు ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడిపోతుంది. పైనుంచి ఒక్కసారిగా కింద పడడం వల్ల సింహం గాయపడుతుంది. దీంతో కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అనవసరంగా చెట్టు ఎక్కానే అన్నట్లుగా నిట్టూరుస్తుంది. ఈ దెబ్బకు కింద పడిన మాంసాన్ని కూడా తినలేకపోతుంది. ఇదే అదునుగా పైనున్న ఇంకో కోతి.. కిందకు దూకి సింహానికి దొరక్కుండా పారిపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: దున్నపోతుకు మేత వేస్తూ.. యువతి వెకిలి చేష్టలు.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..



Updated Date - 2022-08-22T03:21:44+05:30 IST