-
-
Home » Prathyekam » A video of a leopard resting on a branch of a mango tree gone viral sgr spl-MRGS-Prathyekam
-
Viral Video: మామిడి చెట్టుపై చిరుత.. ఎటూ కదలకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే..
ABN , First Publish Date - 2022-09-19T20:35:17+05:30 IST
చిరుత పులులు (leopard) ఎంత పెద్ద చెట్టునైనా చాలా సునాయాసంగా ఎక్కేస్తాయి.

చిరుత పులులు (leopard) ఎంత పెద్ద చెట్టునైనా చాలా సునాయాసంగా ఎక్కేస్తాయి. చిటారు కొమ్మ ఎక్కి కూర్చుంటాయి. చిరుతలు సాధారణంగా చెట్లపై కూర్చుని సేద తీరుతుంటాయి. కొన్ని రోజుల కింద ఓ మామిడి చెట్టు ఎక్కిన చిరుత జనాల కంట పడింది. దీంతో జనాలు దానిని చూసేందుకు గుమిగూడారు. మామిడి చెట్టు మీద ఆ చిరుత సేద తీరుతుందనుకున్నారు.
చెట్టు మీద ఉన్న చిరుత ఎంతకీ అటూ ఇటూ కదలకుండా నిశ్చలంగా ఉండిపోయింది. జాగ్రత్తగా గమనిస్తే అసలు విషయం బయటపడింది. ఆ చెట్టు కొమ్మల్లో చిరుత చిక్కుకుపోయింది. కదిలితే కింద పడిపోతానేమో అనే భయంతో అలాగే ఉండిపోయింది. విషయం అటవీ అధికారులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఆ చిరుతను సురక్షితంగా కిందకు దించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వణ్యప్రాణుల సంరక్షణ విభిన్న సవాళ్లతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో మూడు నెలల కిందటిదని సమాచారం.