Viral Video: వామ్మో ఇంత పెద్ద పాము.. అందులో ఎలా పట్టింది.. పట్టుకునేందుకు వచ్చిన వ్యక్తికి కూడా చుక్కలు చూపించింది..!

ABN , First Publish Date - 2022-09-03T21:10:15+05:30 IST

ప్రపంచంలో వివిధ రకాల పాములు (Different types of snakes) ఉంటాయి. కొన్నింటి వల్ల ఎలాంటి ప్రమాదం లేకున్నా.. మరికొన్ని మాత్రం చాలా విషపూరితమైనవి. అయితే ఎలాంటి..

Viral Video: వామ్మో ఇంత పెద్ద పాము.. అందులో ఎలా పట్టింది.. పట్టుకునేందుకు వచ్చిన వ్యక్తికి కూడా చుక్కలు చూపించింది..!

ప్రపంచంలో వివిధ రకాల పాములు (Different types of snakes) ఉంటాయి. కొన్నింటి వల్ల ఎలాంటి ప్రమాదం లేకున్నా.. మరికొన్ని మాత్రం చాలా విషపూరితమైనవి. అయితే ఎలాంటి పాములైనా.. చూడగానే వెన్నులో వణుకు పుట్టడం మాత్రం ఖాయం. కొన్ని పాములు ఎలా వస్తాయో ఏమో గానీ.. ఒక్కోసారి ఇళ్లల్లోకి చొరబడడమే కాకుండా.. ఊహించని విధంగా బాత్రూముల్లో, వంట గదుల్లోకి చొరబడుతుంటాయి. ఇప్పుడు మనం చూడబోయే పాము.. విచిత్రంగా ఇంటి పైకప్పులోకి దూరింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అంత పెద్ద పాము.. అందులో ఎలా పట్టింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంట్లోకి పాము దూరిందంటూ స్నేక్ క్యాచర్‌కు ఫోన్ వెళ్తుంది. అక్కడి వెళ్లిన అతడు.. ఏ చిన్న పాము అయ్యుంటుంది అని అనుకుంటాడు. పైకప్పులో దూరిన పామును.. ముందుగా తోక పట్టుకుని మెల్లగా బయటికి లాగుతాడు. చివరకు చాంతాడంత పామును చూసి షాక్ అవుతాడు. బయటికి వచ్చిన పాము.. అతన్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ చాకచక్యంగా తప్పించుకుంటూ కొద్ది సేపు దాన్ని తికమక పెడతాడు. తర్వాత తల పట్టుకోవాలని చూడగా... కాలు మీద కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఎలాగోలా తలను పట్టుకుని దాన్ని బయటికి తీసుకెళ్తాడు. ఏం తినిందో ఏమో గానీ.. పాము మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఎట్టకేలకు పామును బయటికి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వామ్మో! ఎంత పెద్ద పాము.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral funny video: ఏవమ్మా! డాన్స్ వేసేటప్పుడు.. ముందు, వెనుక చూసుకోవాలి కదా.. కాస్తుంటే ఏం జరిగేదో తెలుసా..



Read more