-
-
Home » Prathyekam » A video of a chimpanzee feeding an apple to a tortoise is going viral on social media kjr spl-MRGS-Prathyekam
-
Viral Video: చింపాజీ, తాబేలు దోస్తి.. యాపిల్‌ను ఎలా షేర్ చేసుకుంటున్నాయో చూడండి...
ABN , First Publish Date - 2022-07-19T21:13:12+05:30 IST
ఆకలితో ఉన్న సమయంలో ఉన్నదాంట్లోనే సర్దుకుని ఒకరికొకరు షేర్ చేసుకునే స్నేహితులను చాలా మందిని చూసుంటాం. అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమకు తోచిన సాయం చేసే వారిని కూడా చూస్తుంటాం. అయితే, మనుషులకు మేము ఏమాత్రం..

ఆకలితో ఉన్న సమయంలో ఉన్నదాంట్లోనే సర్దుకుని ఒకరికొకరు షేర్ చేసుకునే స్నేహితులను చాలా మందిని చూసుంటాం. అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమకు తోచిన సాయం చేసే వారిని కూడా చూస్తుంటాం. అయితే, మనుషులకు మేము ఏమాత్రం తీసిపోం.. అని అప్పుడప్పుడూ జంతువులు కూడా నిరూపిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చింపాంజి కూడా ఇలాగే చేసింది. తాబేలుకు యాపిల్‌ను తినిపిస్తున్న దృశ్యం.. నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ జూలో రెండు చింపాంజీలు ఒకచోట కూర్చుని యాపిల్ తింటూ ఉంటాయి. అదే సమయంలో ఓ తాబేలు వాటి వద్దకు వస్తుంది. దాని ఆకలిని గుర్తించిన చింపాంజీ.. తాను తింటున్న యాపిల్‌ను తాబేలుకు కూడా తినిపిస్తుంది. తల్లి తన పిల్లలకు ఎలాగైతే కొసరి కొసరి తినిపిస్తుందో.. అలాగే తాబేలుకు కూడా తినిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చింపాంజీది ఎంత మంచి మనసు అంటూ కొందరు... జంతువులను చూసి మనుషులు చాలా నేర్చుకోవాల్సి ఉంది... అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.