-
-
Home » Prathyekam » A video of a biker doing a dangerous stunt in a canal is going viral-MRGS-Prathyekam
-
Viral Video: నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..
ABN , First Publish Date - 2022-07-03T01:40:14+05:30 IST
చాలా మంది యువకులు కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అటు ఇంట్లో వారిని, ఇటు బయటి వారినీ లెక్కచేయకుండా ఇష్టమొచ్చిన పనులన్నీ చేస్తుంటారు. దీనికితోడు సోషల్ మీడియా...

చాలా మంది యువకులు కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అటు ఇంట్లో వారిని, ఇటు బయటి వారినీ లెక్కచేయకుండా ఇష్టమొచ్చిన పనులన్నీ చేస్తుంటారు. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవడంతో కొందరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. హర్యానాలో ఓ యువకుడు ఇలాగే బైక్పై డేంజరస్ స్టంట్ చేశాడు. నిబంధనలు ఉల్లంఘించి అతడు చేసిన ఈ నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు.
హర్యానాలోని పానిపట్ నగరం గుండా వెళ్లే ఢిల్లీ పారలల్ కెనాల్లో ఓ బైకర్.. డేంజరస్ స్టంట్ చేశాడు. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. బైకును అతివేగంగా నడుపుతూ వచ్చి.. ఒక్కసారిగా కాలువలోకి దూకేస్తాడు. పక్కనే ఉన్న అతడి మిత్రులు దీన్నంతా వీడియో తీస్తుంటారు. కాలువలోకి దూకే సమయంలో ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగుండేది. నీళ్లలోకి దూకిన తర్వాత బైకును వదిలేసి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలువలు, నదుల్లో స్నానం చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతుండడంతో యమునా నది, కాలువలు తదితరాల్లో బట్టలు ఉతకడం, స్నానం చేయడాన్ని అధికారులు నిషేధించారు. అయినా చాలా మంది యువకులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు.