Viral Video: బాత్రూంలోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. కాసేపుంటే పరిస్థితే తారుమారయ్యేది..

ABN , First Publish Date - 2022-09-10T03:04:25+05:30 IST

అడవుల్లో ఉండాల్సిన జంతువులు, పాములు, కొండచిలువలు.. కొన్నిసార్లు గ్రామాలు, ఇళ్లల్లోకి చొరబడడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడు అనుకోని..

Viral Video: బాత్రూంలోకి ప్రవేశించిన భారీ కొండచిలువ.. కాసేపుంటే పరిస్థితే తారుమారయ్యేది..

అడవుల్లో ఉండాల్సిన జంతువులు, పాములు, కొండచిలువలు.. కొన్నిసార్లు గ్రామాలు, ఇళ్లల్లోకి చొరబడడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడు అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ భారీ కొండచిలువ బాత్రూంలోకి ప్రవేశించింది. అయితే చివరకు పిల్లలు గమనించడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. 


బ్యాంకాక్‌లోని ఓ ఇంటి బాత్రూమ్‌లోకి బుధవారం 12అడుగుల భారీ కొండచిలువ ప్రవేశించింది. నీళ్ల టబ్‌లోకి ప్రవేశించిన కొండచిలువ కిందనే ఉన్న పెంపుడు పిల్లులను తినేయాలని చూసింది. అదే సమయంలో చిన్నారులు గమనించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని.. దాన్ని జాగ్రత్తగా ఓ సంచిలో వేసుకుని తీసుకెళ్లారు. చిన్నారులు గమనించకుంటే తమ పెంపుడు పిల్లులు కొండచిలువకు ఆహారం అయ్యుండేవని ఇంటి యజమాని తెలిపాడు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఐదేళ్లుగా మహిళా టీచర్ వింత ప్రవర్తన.. ఓ రోజు ఫుల్ బాటిల్‌తో స్కూల్‌కు రావడంతో..





Updated Date - 2022-09-10T03:04:25+05:30 IST

Read more