కోల్‌కతాలో దసరా ఉత్సవాలు.. డచ్ పెయింటర్‌ వాన్ గో `Starry Night` థీమ్‌తో ముస్తాబవుతున్న పందిళ్లు!

ABN , First Publish Date - 2022-10-02T20:29:00+05:30 IST

ప్రస్తుతం దేశం యావత్తూ దసరా సంబరాలు మిన్నంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ దసరా పండగ సందడి నెలకొంది.

కోల్‌కతాలో దసరా ఉత్సవాలు.. డచ్ పెయింటర్‌ వాన్ గో `Starry Night` థీమ్‌తో ముస్తాబవుతున్న పందిళ్లు!

ప్రస్తుతం దేశం యావత్తూ దసరా సంబరాలు మిన్నంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ దసరా పండగ సందడి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో, ముఖ్యంగా కోల్‌కతాలో దసరా సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వినాయక మండపాల తరహాలో కాళిక అమ్మవారి మండపాలు వీధి వీధినా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. వీటిని చూసేందుకు బెంగాళీలే కాదు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కోల్‌కతాకు పోటెత్తుతారు. 


ఇది కూడా చదవండి..

Tamil Nadu: నిజంగా ఈ బామ్మ గ్రేట్.. బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు నిరాకరించిన బామ్మ.. వైరల్ అవుతున్న వీడియో!


దక్షిణ కోల్‌కతాలో వాటికన్ సిటీ తరహాలో ఓ మండపాన్ని నెలకొల్పారు. వాటికన్ సిటీ ఎలా ఉంటుందో.. అచ్చంగా దాన్ని ప్రతిబింబించేలా ఈ మండపాన్ని నెలకొల్పారు. దీన్ని చూడటానికి భక్తులు ఎగబడుతున్నారు. అలాగే ప్రముఖ డచ్ పెయింటర్ విన్సెంట్ వాన్ గో అద్భుత సృష్టి `ది స్టార్రీ నైట్` ప్రభావంతో దక్షిణ కోల్‌కతాలోని దుర్గాదేవి పందిళ్ళు ముస్తాబయ్యాయి. `ది స్టార్రీ నైట్` ప్రభావంతో దక్షిణ కోల్‌కతాలో రెండు పందిళ్ళు, ఉత్తర కోల్‌కతాలో ఒకటి ఏర్పాటు చేశారు. దుర్గా మండపాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకే `ది స్టార్రీ నైట్` థీమ్‌ను ఎంచుకున్నామని వెటరన్ ఆర్టిస్ట్ శంతన్ తెలిపారు. 


విన్సెంట్ వాన్ గో (1853-1890) డచ్ పెయింటర్. వాన్ గో చిత్రకళని ఏ గురువు దగ్గర గానీ, కాలేజ్‌లో గానీ  నేర్చుకోలేదు. స్వయంగా తనంతట తనే సాధన చేసి నేర్చుకున్నాడు. ధనవంతుల కుటుంబంలో పుట్టిన వాన్ గో ఒంటరివాడిగా, భగ్న ప్రేమికుడిగా మిగిలిపోయాడు. 37 ఏళ్ల వయసులోనే మరణించాడు. వాన్ గో బతికి ఉన్నంత కాలంలో అతని పెయింటింగ్స్‌కి గుర్తింపు దక్కలేదు. చనిపోయాకే ప్రపంచ ప్రఖ్యాత మహా చిత్రకారుల్లో ఒకడిగా వాన్ గోకు గుర్తింపు దక్కింది. అతని పెయింటింగ్స్‌ను ప్రపంచం గుర్తించింది. అతని పెయింటింగ్స్ మిలియన్ల డాలర్లకు అమ్ముడయ్యాయి.  వాన్ గో చిత్రీకరణల్లో గొప్ప చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది `ది స్టార్రీ నైట్`. 

Read more