Viral Video: రోడ్డుపై హల్‌చల్ చేసిన బైకర్.. అంతా చూస్తుండగా చివరకు షాకింగ్ ఘటన..

ABN , First Publish Date - 2022-08-29T02:18:34+05:30 IST

చాలా మంది యువకులు బైకు ఎక్కితే చాలు.. తమని తాము సినిమా హీరోల్లా ఊహించుకుంటుంటారు. తమ ప్రావీణ్యం అందరికీ చూపించాలనే తపనతో చిత్రవిచిత్రమైన..

Viral Video: రోడ్డుపై హల్‌చల్ చేసిన బైకర్.. అంతా చూస్తుండగా చివరకు షాకింగ్ ఘటన..

చాలా మంది యువకులు బైకు ఎక్కితే చాలు.. తమని తాము సినిమా హీరోల్లా ఊహించుకుంటుంటారు. తమ ప్రావీణ్యం అందరికీ చూపించాలనే తపనతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి విన్యాసాలు చివరికి వికటిస్తుంటాయి. ఇంకొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అయినా అలాంటి వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు తాము ప్రమాదానికి గురవడమే కాకుండా ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే.. ఓ యువకుడు బైకుతో రోడ్డుపై హల్‌చల్ చేశాడు. అంతా చూస్తుండగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


ట్విట్టర్‌లో (Twitter) ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ బైకర్ రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేస్తుంటాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు హీరోలా బిల్డప్ ఇస్తాడు. బైకును అటూ ఇటూ తిప్పుతూ విన్యాసాలు (Stunts) చేస్తాడు. ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయి లారీ మధ్యలోకి వేగంగా వెళ్తాడు. వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి లారీ కిందపడిపోతాడు. అయితే టైం బాగుండడంతో టైర్ల మధ్య పడకుండా బైకును గట్టిగా పట్టుకుంటాడు. అతన్ని గమనించిన లారీ డ్రైవర్.. వాహనాన్ని వెంటనే నిలిపేస్తాడు. దీంతో బైకర్‌ ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడతాడు. ఈ ఘటనను వెనుకే వస్తున్న వాహనంలోని వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: నడుస్తూ వెళ్తున్న యువతి ఫోన్‌ను లాక్కెళ్లిన దొంగ.. చివరకు అతన్ని పట్టుకుని చూడగా..





Updated Date - 2022-08-29T02:18:34+05:30 IST