OMG: ఇవెక్కడి రేట్లు అమెజాన్ మావా.. బకెట్ రూ.25,999, రెండు Mugs పది వేలా.. ‘అట్లుంటది మనతోని’ అంటావా..!

ABN , First Publish Date - 2022-05-25T02:11:02+05:30 IST

OMG: ఇవెక్కడి రేట్లు అమెజాన్ మావా.. బకెట్ రూ.25,999, రెండు Mugs పది వేలా.. ‘అట్లుంటది మనతోని’ అంటావా..!

OMG: ఇవెక్కడి రేట్లు అమెజాన్ మావా.. బకెట్ రూ.25,999, రెండు Mugs పది వేలా.. ‘అట్లుంటది మనతోని’ అంటావా..!

ఒక ప్లాస్టిక్ బకెట్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే రెండొందలో, మూడొందలో కాదు మంచి క్వాలిటీ బకెట్ అనుకుంటే ఐదారువందలు నుంచి వెయ్యి వరకూ ఉండొచ్చు. రెండు Bathroom Mugs ఎంత ధర ఉండొచ్చు. రెండూ కలిపి రెండు, మూడు వందలు ఉండొచ్చనుకుందాం (అంత కూడా ఉండవనుకోండి). కానీ.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ లో బాత్రూమ్స్ లో వాడుకునే ఒక ప్లాస్టిక్ బకెట్ ధర విస్మయానికి గురిచేసింది. 55 శాతం డిస్కౌంట్ పోనూ ప్లాస్టిక్ బకెట్ రూ.25,999 చూపించడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాదు.. రెండు ప్లాస్టిక్ మగ్గుల ధర కూడా దాదాపు పదివేలు(అమెజాన్ లో కనిపించిన ధర రూ.9,914) ఉండటంతో ‘ఇవెక్కడి బకెట్లు, మగ్గుల్రా మావా’ అని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. సోషల్ మీడియాలో ఈ బకెట్, ప్లాస్టిక్ మగ్గుల ధరలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను పోస్ట్ చేసి అమెజాన్ ను ట్రోల్ చేస్తున్నారు. సదరు ఈ-కామర్స్ సంస్థ ఈ వ్యవహారం తర్వాత ఆ బకెట్ ధరను తొలగించింది. కానీ.. ఆ మగ్గుల ధరను మాత్రం 9,914 రూపాయలకు ఒక్క రూపాయి కూడా ‘తగ్గేదేలే’ అన్నట్టుగా అదే ధరకు ఇప్పటికీ చూపిస్తుంది.



బకెట్ ధర విషయంలో కాంప్రమైజ్ అయినా మగ్గుల విషయంలో మాత్రం ‘మా రేటింతే’ అన్నట్టుగా అమెజాన్ వ్యవహరిస్తోందని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఈ తరహాలో భారీ ధరలు కనిపించడం కొత్తేమీ కాదు. కొన్ని సందర్భాల్లో Technical Error అని సదరు సంస్థలు సర్ది చెప్పి ఆ ధరలను మారుస్తుంటాయి. మరి.. ఈ మగ్గుల విషయంలో అమెజాన్ అదే మాట చెప్పి ధరను మార్చుతుందో లేక ఒక్కో మగ్గును రూ.5 వేలకు అమ్ముతుందో చూడాలి. నెటిజన్లు మాత్రం అమెజాన్ లో ఈ ధరలను చూసి సదరు ఈ-కామర్స్ సంస్థను సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తున్నారు. ఆ బకెట్, ఆ రెండు మగ్గులు ఏమైనా బంగారం పోత పోసి తయారుచేశారా అంత ధర పెడితే కొనడానికని ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2022-05-25T02:11:02+05:30 IST