Viral photo: చెట్టు మొదలుకు గుడ్లగూబ కళ్లు.. ఎంత బాగా మభ్యపెడుతోందంటూ నెటిజన్ల రియాక్షన్..

ABN , First Publish Date - 2022-09-24T00:38:24+05:30 IST

గుడ్లగూబ.. ఈ పేరు వింటేనే చాలా మందిలో భయం పుట్టుకొస్తుంది. మిగతా పక్షుల కంటే భిన్నంగా ఉండడంతో పాటూ రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తుంటాయనే విషయం తెలిసిందే. ఇవి..

Viral photo: చెట్టు మొదలుకు గుడ్లగూబ కళ్లు.. ఎంత బాగా మభ్యపెడుతోందంటూ నెటిజన్ల రియాక్షన్..

గుడ్లగూబ.. ఈ పేరు వింటేనే చాలా మందిలో భయం పుట్టుకొస్తుంది. మిగతా పక్షుల కంటే భిన్నంగా ఉండడంతో పాటూ ఎక్కువగా రాత్రిళ్లు మాత్రమే సంచరిస్తుంటాయనే విషయం తెలిసిందే. ఇవి ఎదురుపడితే అపశకునం అని చాలా మంది భావిస్తుంటారు. అయితే హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం గుడ్లగూబ చాలా మంచి శుభశకునం. ఏదిఏమైనా పెద్ద పెద్ద గుడ్లు వేసుకుని.. చూడాలంటనే భయమేసే గుడ్లగూబను ఎవరూ ఇష్టపడరు. కనీసం వీటిని చూడటానికి కూడా ఇష్టపడరు. అందుకేనేమో ఇప్పుడు మనం చెప్పుబోయే గుడ్లగూబ.. ఓ చెట్టు బెరడులో కలిసిపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. చెట్టు మొదలుకు గుడ్లగూబ కళ్లు అతికించినట్లుగా ఉన్న ఈ ఫొటో చూసి.. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో (Social media) ఓ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. అడవిలో ఓ చెట్టు కొమ్మపై ఉన్న గుడ్లగూబ (owl).. తనను ఎవరూ గుర్తించలేనంతగా చెట్టులో కలిసిపోయింది. గుడ్లగూబ ఈకలు రంగు, చెట్టు బెరడు రంగు ఒకే రకంగా ఉండడంతో అందులో కలిసిపోయినట్లుగా ఉంది. దాని కళ్లు తప్ప మిగతా భాగం మొత్తం పూర్తిగా చెట్టు రంగులో కలిసిపోయింది. దీంతో చూడటానికి చెట్టుకు కళ్లు పొడుచుకు వచ్చినట్లుగా ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రకృతి ఎంతో అద్భుతమైనది (Beautiful nature) .. అని చెప్పడానికి ఈ ఫొటో ఒక ఉదాహరణ అని కొందరు, శత్రువులు ఎవరూ దీన్ని గుర్తుపట్టలేరు.. అంటూ మరికొందరు, ఆహా ఈ గుడ్లగూబ ఎంత బాగా మభ్యపెడుతోందంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. 

Viral Video: శుఖీభవ.. అంటూ ఆశీర్వదించిన ఏనుగు.. కృతజ్ఞత చూపిండంలో దీనికి మించిన జంతువు లేదనుకుంటా..



Updated Date - 2022-09-24T00:38:24+05:30 IST