Viral News: భార్య నుంచి మెసేజ్.. కిరాణా సరుకుల కోసం స్టోర్‌కు వెళ్లిన భర్త.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!

ABN , First Publish Date - 2022-10-02T22:11:47+05:30 IST

ఎప్పటిలాగే ఆ భర్త.. ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. డ్యూటీ టైం పూర్తవగానే సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరాడు. సరిగ్గా అప్పుడే.. అతడికి తన భార్య నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘ఇంట్లో కిరాణా సరుకులు నిండు

Viral News: భార్య నుంచి మెసేజ్.. కిరాణా సరుకుల కోసం స్టోర్‌కు వెళ్లిన భర్త.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పటిలాగే ఆ భర్త.. ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్‌కు వెళ్లిపోయాడు. డ్యూటీ టైం పూర్తవగానే సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరాడు. సరిగ్గా అప్పుడే.. అతడికి తన భార్య నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘ఇంట్లో కిరాణా సరుకులు నిండుకున్నాయి. షాపునకు వెళ్లి సరుకులు తీసుకురండి’ అని మెసేజ్‌లో ఉండటంతో.. దారిలో ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ తనకు కావాల్సిన సరుకులు తీసుకుని.. ఇంటికి వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు ఉదయం అతడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. కాగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికా(America)లోని మిచిగాన్(Michigan) రాష్ట్రానికి చెందిన ప్రిస్టన్ మాకీ(Preston Maki)(46).. తన భార్యతో కలిసి మార్కెట్ అనే నగరంలో నివాసం ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఇతడు తాజాగా ఉదయాన్నే నిద్రలేచి ఆఫీస్ బయల్దేరి వెళ్లిపోయాడు. అక్కడ విధులు ముగించుకుని.. సాయంత్రం వేళ ఇంటికి తిరుగు పయనం అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రిస్టన్‌కు తన భార్య నుంచి మెసేజ్ వచ్చింది. ‘వంటింట్లో సరుకులు నిండుకున్నాయి. స్టోర్‌కు వెళ్లి రేషన్ సరుకులు తీసుకురండి’ అని భార్య పంపిన మెసేజ్‌లో ఉండటంతో.. అతడు దారిలో ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ కిరాణా సరుకులు కొనుగోలు చేసిన తర్వాత.. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావించి లాటరీ టికెట్లు కూడా కొనుగోలు చేశాడు. అనంతరం సరుకులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు.



మరుసటి రోజు లాటరీ డ్రాకు సంబంధించిన ఫలితాలను చూసి ప్రిస్టన్ ఎగిరి గంతులేశాడు. లాటరీ డ్రాలో అతడు కొనుగోలు చేసిన లాటరీ(Lottery) టికెట్‌‌కు సుమారు రూ.1.5కోట్లకు సమానమైన అమెరికన్ డాలర్లు తగిలాయని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడిన అతడు.. పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. తన భార్య గనక తనకు మెసేజ్ చేసి ఉండకపోతే.. డబ్బులు వచ్చేవి కావంటూ సంబరపడిపోయాడు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌(Viral)గా మారింది. 


Read more