కలలో వచ్చిన నంబర్‌‌పై లాటరీ టికెట్ కొన్నాడు.. చివరికి జాక్‌పాట్ కొట్టాడు.. ఇంతకీ అతను ఎంత గెలుచుకున్నాడో తెలుసా..

ABN , First Publish Date - 2022-07-02T02:53:58+05:30 IST

కలలు వివిధ రకాలుగా ఉంటాయి. మంచి కలలు వచ్చిన సమయంలో ఆ రోజంతా ఆనందంగా..

కలలో వచ్చిన నంబర్‌‌పై లాటరీ టికెట్ కొన్నాడు.. చివరికి జాక్‌పాట్ కొట్టాడు.. ఇంతకీ అతను ఎంత గెలుచుకున్నాడో తెలుసా..

కలలు వివిధ రకాలుగా ఉంటాయి. మంచి కలలు వచ్చిన సమయంలో ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. అలాంటి కలలే మళ్లీ మళ్లీ రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వర్జీనియాకు చెందిన ఓ వ్యక్తికి లాటరీలో కోట్లు గెలుచుకున్నట్లు కల వచ్చింది. ఈ కల నిజమైతే ఎంత బాగుండు.. అని పొద్దున లేవగానే అనుకున్నాడు. ఓ సారి ట్రై చేద్దాం అని.. కలలో వచ్చిన నంబర్‌పై లాటరీ టికెట్ కొన్నాడు. అయితే ఆశ్చర్యంగా జాక్‌పాట్ కొట్టాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే..


యునైటెడ్ స్టేట్స్‌లో ఉంటున్న అలోంజో కోల్‌మన్ అనే వ్యక్తికి ఇటీవల ఓ కల వచ్చింది. అందులో తాను వర్జీనియా లాటరీ గెలుచుకున్నట్లు, పెద్ద మొత్తంలో నగదు వచ్చినట్లు.. లాటరీ నంబర్‌తో సహా కల వచ్చింది. పొద్దున లేచాక.. రాత్రి వచ్చిన కల గుర్తుకు వచ్చింది. ఓ సారి ట్రై చేస్తే పోలా అని అనుకున్నాడు. వెంటనే కలలో వచ్చిన నంబర్‌పై వర్జీనియా లాటరీ టికెట్‌ని 2డాలర్లు పెట్టి కొన్నాడు. లాటరీ నిర్వాహకులు $1 మిలియన్, $500,000, $250,000.. ఇలా మూడు బహుమతులు ప్రకటించారు.

అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..


ప్రతి బుధ, ఆదివారాల్లో లాటరీ నిర్వాహకులు డ్రా తీస్తుంటారు. జూన్ 11న తీసిన డ్రాలో కోల్‌మన్.. $250,000(రూ.1,97,36747)లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. నిర్వాహకులు గురువారం లాటరీ ఫలితాలను ప్రకటించారు. $250,000 చెక్కుతో దిగిన పొటోను కోల్‌మన్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పొటో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఓ ట్రక్ డ్రైవర్ తమ లాటరీ ద్వారా $1 మిలియన్(రూ.7,89,00,000.00) జాక్‌పాట్ కొట్టాడని నిర్వాహకులు తెలిపారు.

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు..

Read more