ఈ పాప పుట్టిన 16 గంటల్లోనే షాకింగ్ ఘటన.. అధికారులే స్వయంగా ఈ బాలికకు ‘దుర్గ’ అని పేరు పెట్టడం వెనుక..

ABN , First Publish Date - 2022-10-05T00:24:24+05:30 IST

దేశమంతా దుర్గాపూజకు సిద్ధమవుతోంది.. ఈ నేపథ్యంలో బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది..

ఈ పాప పుట్టిన 16 గంటల్లోనే షాకింగ్ ఘటన.. అధికారులే స్వయంగా ఈ బాలికకు ‘దుర్గ’ అని పేరు పెట్టడం వెనుక..

దేశమంతా దుర్గాపూజకు సిద్ధమవుతోంది.. ఈ నేపథ్యంలో బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.. జిల్లా ఆస్పత్రి డ్రెనేజ్‌లో ఓ ఆడపిల్ల కనిపించింది.. ఆ పాప పుట్టి అప్పటికి 16 గంటలు మాత్రమే అయింది.. ముక్క పచ్చలారని ఆ చిన్నారిని కాలువలో పడేసి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.. ఆస్పత్రి సిబ్బంది ఆ చిన్నారిని కాపాడి అధికారులకు సమాచారం అందించారు.. జిల్లా కలెక్టర్ ఆ చిన్నారి గురించి తెలుసుకుని హాస్పిటల్‌కు వెళ్లారు.. దసరా ముందు రోజు పుట్టిన ఆ బాలికకు `దుర్గ` అని పేరు పెట్టారు. 


ఇది కూడా చదవండి..

వాట్ ఏన్ ఐడియా.. కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా?.. ఓ లేడీ రిపోర్టర్ ఐడియాకు నెటిజన్లు షాక్!


భోజ్‌పూర్ జిల్లాలోని సదర్ ఆసుపత్రి టాయిలెట్ డ్రెయిన్‌లో అప్పుడే పుట్టిన ఆడపిల్ల కనిపించింది. ఆసుపత్రి సిబ్బంది ఆ చిన్నారిని రక్షించి పిల్లల వార్డులో భద్రంగా ఉంచారు. జిల్లా కలెక్టర్ సదర్‌ ఆస్పత్రికి చేరుకుని బాలిక పరిస్థితిని సమీక్షించారు. బాలిక ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ బాలికకు `దుర్గ` అని పేరు పెట్టారు. ఆ చిన్నారి బాధ్యతను చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. అలాగే ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఎవరో  కనుక్కోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. `ఎవరైనా ఆడ బిడ్డను పెంచుకోవడానికి ఇష్టపడకపోతే, ఆ బిడ్డను ఎక్కడో విసిరేయవద్దు. తీసుకొచ్చి మాకు అప్పగించండి. పిల్లలను పెంచేందుకు ఏర్పాట్లు చేశామ`ని చెప్పారు. 

Read more