భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించిన భర్త.. ఏంటీ పని.. అని అంతా వారిస్తున్నా వినకుండా..

ABN , First Publish Date - 2022-10-15T01:34:35+05:30 IST

పిల్లలు లేరని బాధపడే మహిళలు ఉంటారు.. భర్త వేధిస్తున్నాడని కుమిలిపోయే మహిళలూ ఉంటారు.. అత్తమామలు పోరు భరించలేక సతమతమయ్యే మహిళలూ ఉంటారు. కానీ పిల్లలు..

భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించిన భర్త.. ఏంటీ పని.. అని అంతా వారిస్తున్నా వినకుండా..

పిల్లలు లేరని బాధపడే మహిళలు ఉంటారు.. భర్త వేధిస్తున్నాడని కుమిలిపోయే మహిళలూ ఉంటారు.. అత్తమామలు పోరు భరించలేక సతమతమయ్యే మహిళలూ ఉంటారు. కానీ పిల్లలు ఉండి.. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమస్యలూ లేకుంటే మహిళలకు అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. కానీ కొందరు మహిళలు మాత్రం ఇంట్లో ఎలాంటి వేధింపులూ లేకున్నా.. సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. బీహార్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నలుగురు పిల్లలు ఉన్న మహిళకు ఇంట్లో ఎలాంటి సమస్యలూ లేవు. కానీ తెలిసి తెలిసి తప్పటడుగు వేసింది. ఈ విషయం తెలిసిన భర్త చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే...


బీహార్ (Bihar) భాగల్‌పూర్ బంగా గ్రామానికి చెందిన శ్రవణ్‌కు 2012లో పూజ అనే యువతితో వివాహమైంది. ఈమెను ఇంట్లో అంతా బాగా చూసుకునేవారు. ఈ క్రమంలో వారికి నలుగురు పిల్లలు జన్మించారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పూజకు చోటూ అనే యువకుడు పరిచయమయ్యాడు. తప్పని తెలిసినా అతడితో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించింది. భర్తకు తెలీకుండా అతడితో రాసలీలలు సాగించేది. ఈ క్రమంలో వారిద్దరినీ గ్రామస్తులు గమనించడంతో విషయం భర్తకు తెలిసింది. భార్యను పిలిచి ఇదే విషయాన్ని అడిగాడు.

B.Com Idli Wala Viral Video: బీకామ్ చదివి మరీ ఓ బైక్‌పై ఈ కుర్రాడు ఇడ్లీలు అమ్ముకోవాల్సి రావడం వెనుక..!


అయితే తనకు ప్రియుడే కావాలని ఆమె తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీలేక ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదేం పని.. అంటూ కుటుంబ సభ్యులు వారిస్తున్నా అతను వినిపించుకోలేదు. చివరకు న్యాయవాదిని కలిసి న్యాయపరమైన విషయాల గురించి మాట్లాడాడు. అనంతరం భార్య ప్రియుడిని పిలిపించి, ఇద్దరికీ వివాహం జరిపించాడు. నలుగురు పిల్లలను శ్రవణ్ వద్దే ఉంచుకుని, భార్యను ప్రియుడితో పంపించాడు. భర్త, పిల్లలు ఉన్నా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన పూజాను అంతా విమర్శిస్తుండగా, శ్రవణ్‌ను మాత్రం గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

స్నేహితులుగా ఉందామంటూ యువతి సలహా.. అలాగే అని ఒప్పుకొన్న యువకుడు.. ఓ రోజు ఆమెకు ప్రపోజ్ చేయడంతో..Read more