Viral Video: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే.. ఓ కాలు లేకున్నా భార్యను వెనక కూర్చోబెట్టుకుని మరీ..

ABN , First Publish Date - 2022-09-29T19:04:18+05:30 IST

మనసుంటే మార్గం ఉంటుంది. ఓ వ్యక్తి ఈ మాటలు నిజం చేశాడు. కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను ఎక్కించుకుని.. అతడు సైకిల్‌పై ప్రయాణం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సైకిల్‌పై ఎక్కించుకుని.. దాన్ని

Viral Video: మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే.. ఓ కాలు లేకున్నా భార్యను వెనక కూర్చోబెట్టుకుని మరీ..

ఇంటర్నెట్ డెస్క్: మనసుంటే మార్గం ఉంటుంది. ఓ వ్యక్తి ఈ మాటలు నిజం చేశాడు. కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను ఎక్కించుకుని.. అతడు సైకిల్‌పై  ప్రయాణం చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సైకిల్‌పై ఎక్కించుకుని.. దాన్ని తొక్కుకుంటే పోతేనే అతడు గొప్పవాడు అయిపోతాడా అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. ఇలా ఆలోచించిన వాళ్లందరూ కచ్చితంగా తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. ఈ వీడియోలో సైకిల్ తొక్కుతున్న ఆ భర్తకు ఒక కాలు లేదు. ఒంటి కాలితో అతడు సైకిల్‌ను తొక్కుతున్నాడు. 


వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఓ వ్యక్తి సైకిల్‌పై ముందు ఒకరిని కూర్చోబెట్టుకుని.. ఓ కర్ర సాయంతో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. వెనకాల తన భార్యను మరొక కొడుకును కూర్చొబెట్టుకున్నాడు. అనంతరం అదే కర్రతో బ్యాలెన్స్ చేస్తూ.. మరో కాలుతో సైకిల్‌ను ముందకు తొక్కాడు. కాస్త వేగం పుంజుకున్న వెంటనే.. తన చేతిలోని కర్రను హ్యాండిల్‌పై పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు. అయినా.. నెటిజన్లు అతడి పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను కష్టపెట్టొద్దనే నీ ఉద్దేశం ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది’ అంటూ కామెంట్స్ చేస్తూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 



Updated Date - 2022-09-29T19:04:18+05:30 IST