Viral Video: ఎలుగు బంటిని దొంగగా మార్చేసిన ఆకలి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-25T21:00:37+05:30 IST

ఆకలి.. ఇది ఎవరితోనైనా ఏపనైనా చేయిస్తుంది. మనుషుల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. చివరికి అడవి జంతువులను కూడా ఇది దొంగగా మార్చేసింది. అడవి జంతువులు ఏంటి.. దొంగగా మారడం ఏంటని ఆశ్చ

Viral Video: ఎలుగు బంటిని దొంగగా మార్చేసిన ఆకలి.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: ఆకలి.. ఇది ఎవరితోనైనా ఏపనైనా చేయిస్తుంది. మనుషుల విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. చివరికి అడవి జంతువులను కూడా ఇది దొంగగా మార్చేసింది. అడవి జంతువులు ఏంటి.. దొంగగా మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజం. ఓ ఎలుగు బంటి(Bear) ఆకలి వల్ల దొంగగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



పాపం ఎలుగు బంటికి బాగా ఆకలేసినట్టుంది. అడవిలో ఏం దొరక్కపోయేసరికి జనావాసాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా ఓ షాపింగ్ మాల్ తలుపు తెరచి.. అక్కడున్న ఆహార పదార్థాలను గమనించింది. అనంతరం ఓ కూల్‌డ్రింక్ ప్యాకెట్‌ను నోట కరుచుకుని.. అక్కడి నుంచి మాల్(Shop) నుంచి తిరుగు ముఖం పట్టింది. ఎలుగు బంటి షాపింగ్ మాల్‌కు వచ్చినప్పుడు అక్కడే ఉన్న కొందరు కస్టమర్లు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు కానీ వీడియో(Viral Video) మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.3 మిలియన్ల మంది వీక్షించారు. 




Updated Date - 2022-09-25T21:00:37+05:30 IST