కన్నతల్లిని రాత్రిపూట నడిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. తెల్లారిన తర్వాత షాకింగ్ దృశ్యం చూసి స్థానికుల కంట కన్నీరు..!

ABN , First Publish Date - 2022-09-28T02:53:34+05:30 IST

ఆ వృద్ధురాలి వయసు వంద సంవత్సరాలు.. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు.. అతడి వయసు 60 సంవత్సరాలు..

కన్నతల్లిని రాత్రిపూట నడిరోడ్డుపై వదిలేసిన కొడుకు.. తెల్లారిన తర్వాత షాకింగ్ దృశ్యం చూసి స్థానికుల కంట కన్నీరు..!

ఆ వృద్ధురాలి వయసు వంద సంవత్సరాలు.. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు.. అతడి వయసు 60 సంవత్సరాలు.. శనివారం సాయంత్రం ఆ కొడుకు తన తల్లిని నడిరోడ్డు పైకి ఈడ్చేశాడు.. ఆమె బట్టలు, మంచం విసిరేసి ఆమెను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు.. రోడ్డుపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమానికి తరలించారు.. ఆ వృద్ధురాలి కొడుకు తర్వాతి రోజు వృద్ధాశ్రమానికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: ఇరవై రోజుల క్రితం జన్మించిన కవల పిల్లలు మాయం.. విచారణలో బయటపడిన షాకింగ్ విషయాలు..!


ఇండోర్‌కు చెందిన రామేశ్వర్ ప్రజాపత్ లాక్‌డౌన్‌కు ముందు, మాల్వా మిల్లు ప్రాంతంలో పాన్ దుకాణాన్ని నడిపేవాడు. అతను తన తల్లి, ముగ్గురు కొడుకులతో కలిసి నివసించాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో అతడికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్నుంచి రామేశ్వర్‌కు కష్టాలు మొదలయ్యాయి. అతని ముగ్గురు కొడుకులు ఆ వృద్ధురాలిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక, కొడుకుల ఒత్తిడికి తట్టుకోలేక తల్లిని వదిలించుకోవాలని కొడుకు నిర్ణయించుకున్నాడు. 


శనివారం రాత్రి 10.30 గంటలకు భూతేశ్వరాలయం పక్కనే ఉన్న రోడ్డుపై తల్లిని రామేశ్వర్ వదిలేశాడు. అతను తన తల్లి బట్టలు, మంచం కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డుపై ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమానికి తరలించారు. తల్లిని వృద్ధాశ్రమానికి తరలించినట్లు తెలుసుకున్న రామేశ్వర్‌ ఆదివారం ఉదయం వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. తనను క్షమించాలని వేడుకున్నాడు. `నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారు నాయనమ్మను భరించలేరు. అందుకే నేను ఆమెను వదిలేయాల్సి వచ్చింద`ని చెప్పాడు. 

Updated Date - 2022-09-28T02:53:34+05:30 IST