పాఠశాల వార్షికోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తూ ఆ విద్యార్థులు ఏం చేశారంటే.. అసభ్యకర వీడియో చిత్రీకరించి..

ABN , First Publish Date - 2022-03-16T18:11:33+05:30 IST

పాఠశాల వార్షికోత్సవం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. విద్యార్థులందరూ ఫంక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

పాఠశాల వార్షికోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తూ ఆ విద్యార్థులు ఏం చేశారంటే.. అసభ్యకర వీడియో చిత్రీకరించి..

పాఠశాల వార్షికోత్సవం కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. విద్యార్థులందరూ ఫంక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు తమ క్లాస్‌మెంట్‌ను వేధించారు.. ఒక విద్యార్థిని బంధించి, బట్టలు విప్పి నగ్నంగా మార్చి వీడియో చిత్రీకరించారు.. ఆ వీడియోను వైరల్ చేశారు.. ఆ ఘటనపై విచారణ జరిపిన విద్యా శాఖ ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసి పోలీసుల చేత అరెస్ట్ చేయించింది. 


రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల వార్షిక దినోత్సవం త్వరలో జరగబోతోంది. అందరూ ఆ పనులతో బిజీగా ఉండగా 9వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని ఏడిపించేందుకు పథకం వేశారు. అతడిని బంధించి ఓ గదిలోకి తీసుకెళ్లారు. బలవంతంగా బట్టలు ఊడదీసి మొబైల్ ద్వారా వీడియోను చిత్రీకరించారు. ఆ ఘటన గురించి బాధిత విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే బాధిత విద్యార్థి తల్లిదండ్రులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోరారు. 


నిందితులు అక్కడితో ఆగకుండా ఆ ఘటనకు సంబంధించిన వీడియోను వైరల్ చేశారు. మరోసారి బాధితుడిని వేధించారు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులైన మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Read more