Viral: ఈ పెద్దాయన అలా ఎలా తింటున్నాడో.. అసలు ఆయన చేతిలో ఉన్నవేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-25T20:59:03+05:30 IST

ఒక లవంగం తింటేనే అమ్మో కారం అంటూ పక్కన పడేస్తాం. అలాంటిది ఆయనకు మాత్రం ప్రతిరోజూ పావు కిలో లవంగాలు..

Viral: ఈ పెద్దాయన అలా ఎలా తింటున్నాడో.. అసలు ఆయన చేతిలో ఉన్నవేంటో తెలిస్తే..

లవంగా తిననిదే ముద్ద దిగదు

ప్రతిరోజూ పావు కిలో లవంగాలు తింటున్న వృద్ధుడు


హొళగుంద(కర్నూలు జిల్లా): ఒక లవంగం తింటేనే అమ్మో కారం అంటూ పక్కన పడేస్తాం. అలాంటిది ఆయనకు మాత్రం ప్రతిరోజూ పావు కిలో లవంగాలు తిననిదే ముద్ద దిగదు. హొళగుందలోని దిడ్డి కాలనీకి చెందిన సీతయ్యకు(73) ఏడేళ్ల క్రితం అనేక ఆరోగ్య సమస్యలు ఉండేవి. షుగర్‌ కూడా ఉండటంతో బళ్లారిలోని డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. పొగ తాగాలనిపించినప్పుడు రోజుకు ఒకటి, రెండు లవంగాలు తినమని వైద్యులు సూచించారు. దీంతో పొగ తాగాలన్న ఆలోచన వచ్చినప్పుడు లవంగాలను నమిలేవాడు. ఇలా ఏడేళ్లలో ఈ అలవాటు పెరుగుతూ నేడు రోజుకు పావుకిలో లవంగాలు తిననిదే ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. లవంగాలు తింటున్నప్పటి నుంచి తనకు షుగర్‌ వ్యాధి అదుపులో ఉందని, ఐదేళ్ల నుంచి షుగర్‌ మాత్రలు కూడా వేసుకోవడం లేదని సీతయ్య చెబుతున్నారు.

Read more