Viral News: తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 32ఏళ్ల వ్యక్తి.. రిపోర్టులు చూసి వైద్యుల మైండ్ బ్లాంక్.. అతడి పొట్టలో..

ABN , First Publish Date - 2022-09-29T15:11:00+05:30 IST

ఒక వ్యక్తి కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఆ నొప్పి తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. ఎక్స్‌ రే తీయించారు. అనంతరం రిపోర్టులు చూసి డాక్టర్లు ఒక్కసారిగా షాక

Viral News: తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 32ఏళ్ల వ్యక్తి.. రిపోర్టులు చూసి వైద్యుల మైండ్ బ్లాంక్.. అతడి పొట్టలో..

ఇంటర్నెట్ డెస్క్: ఒక వ్యక్తి కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఆ నొప్పి తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. ఎక్స్‌ రే తీయించారు. అనంతరం రిపోర్టులు చూసి డాక్టర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి పొట్టలో ఉన్న వాటిని చూసి కంగుతిన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త స్థానికంగా వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ విషయం ఏంటనే వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తికి ప్రస్తుతం 32ఏళ్లు. అతడు మత్తుపదార్థాలకు బానిస కావడంతో.. వాటిని మాన్పించేందకు కుటుంబ సభ్యులు విజయ్‌ని డి-అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. ఈ క్రమంలోనే అతడికి కడుపు నొప్పి ప్రారంభమైంది. తొలుత ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు లైట్ తీసుకున్నారు. మత్తు పదార్థాలను తీసుకోకపోవడం వల్లే అలా జరుగుతుందేమో అని భావించారు. అయితే తాజాగా అతడికి కడుపు నొప్పి తీవ్రమైంది. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ విజయ్‌ను పరీక్షించిన డాక్టర్లు.. వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలోనే రిపోర్టులు చూసి డాక్టర్లు నోరెళ్లబెట్టారు. 



విజయ్ పొట్టలో పెద్ద సంఖ్యలో లోహపు వస్తువులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారి అనుమతితో శస్త్ర చికిత్స ప్రారంభించారు. దాదాపు 2 గంటలపాటు విజయ్‌కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. అతడి పొట్టలోంచి సుమారు 63 చెంచాలను(Spoons) తీశారు. డి-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులే విజయ్‌తో బలవంతంగా స్పూన్‌లను మింగించి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. విజయ్ వాటిని ఎప్పుడు ఉంటాడనేది స్పష్టంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వ్యక్తి పొట్టలోంచి భారీ మొత్తంలో చెంచాలు బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం(Viral) అయింది.

Updated Date - 2022-09-29T15:11:00+05:30 IST