-
-
Home » Prathyekam » 5 Killed In Fiery Collision At Los Angeles Junction sgr spl-MRGS-Prathyekam
-
Viral Video: ఘోర ప్రమాదం.. ఐదుగురి ప్రాణం తీసిన అతి వేగం.. వైరల్ అవుతున్న వీడియో
ABN , First Publish Date - 2022-08-07T02:16:18+05:30 IST
అతి వేగం ప్రాణాంతకం అని తెలిసినా సరే చాలా మంది సాహసాలు చేస్తుంటారు.

అతి వేగం ప్రాణాంతకం అని తెలిసినా సరే చాలా మంది సాహసాలు చేస్తుంటారు. తాము ప్రమాదంలో పడడమే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లాస్ ఏంజెలిస్‌లో (Los Angeles Accident) జరిగిన ఈ ఘటనలో ఓ గర్భిణీ, ఏడాది వయసున్న చిన్నారితోపాటు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
సిగ్నల్ దగ్గర ఒక వైపు వాహనాలు వరుసగా వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన మెర్సిడెస్ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు. భర్త, కొడుకుతో కలిసి వైద్య పరీక్షల కోసం వెళ్తున్న ఓ గర్భిణీ అగ్నికి ఆహూతయ్యింది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారాయి.