హాస్టల్‌లో రాత్రి 10 గంటలకు బాత్రూంకు వెళ్లాడో విద్యార్థి.. మరుక్షణంలోనే భయంతో కేకలు.. ఇంతకీ లోపల ఏం కనిపించిందంటే..

ABN , First Publish Date - 2022-10-04T20:07:57+05:30 IST

అది రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీ (ఆర్‌టీయూ) హాస్టల్‌.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో

హాస్టల్‌లో రాత్రి 10 గంటలకు బాత్రూంకు వెళ్లాడో విద్యార్థి.. మరుక్షణంలోనే భయంతో కేకలు.. ఇంతకీ లోపల ఏం కనిపించిందంటే..

అది రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీ (ఆర్‌టీయూ) హాస్టల్‌.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఒక విద్యార్థి బాత్రూమ్‌కు వెళ్లాడు.. మరుక్షణంలో కేకలు పెడుతూ బయటకు పరిగెత్తాడు.. లోపల ఐదడుగుల నాగుపాము కనిపించడమే ఆ విద్యార్థి భయానికి కారణం.. దీంతో హాస్టల్‌లో విద్యార్థులందరూ బయటకు పరిగెత్తారు.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.. రాజస్థాన్‌లోని కోటలో సోమవారం ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

`సార్.. నా ఎలుకను కిడ్నాప్ చేశారు.. కాస్త వెతికిపెట్టండి..` పోలీస్ స్టేషన్‌కు చేరిన వింత కేసు.. అసలేం జరిగిందంటే..


ఆర్‌టీయూ హాస్టల్‌లో సోమవారం అర్ధరాత్రి నాగుపాము కలకలం సృష్టించింది. ఒక విద్యార్థి బాత్రూమ్‌లో పామును చూసి భయంతో కేకలు వేశాడు. దీంతో హాస్టల్ నంబర్ 3లో నివసిస్తున్న విద్యార్థులందరూ భయంతో బయటకు వెళ్లిపోయారు. స్నాక్ క్యాచర్, పర్యావరణ ప్రేమికుడు గోవింద్ శర్మను పిలిపించారు. గోవింద్ నాగుపామును సురక్షితంగా రక్షించి అడవిలో వదిలేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more