విద్యుత్ బిల్లు చూసిన ఆమె కంగుతింది... కళ్లు బైర్లు కమ్మి, గుండెపోటు వచ్చి..

ABN , First Publish Date - 2022-10-06T13:39:07+05:30 IST

ఓ మహిళ ఇంటికి ఒకరోజు కరెంటు బిల్లు రూ.37 లక్షలు...

విద్యుత్ బిల్లు చూసిన ఆమె కంగుతింది... కళ్లు బైర్లు కమ్మి, గుండెపోటు వచ్చి..

ఓ మహిళ ఇంటికి ఒకరోజు కరెంటు బిల్లు రూ.37 లక్షలు వచ్చింది. స్మార్ట్ మీటర్ల ద్వారా ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. 25 ఏళ్ల చోలే మైల్స్ ప్రియర్... వెస్ట్ ససెక్స్ (యూకే) నివాసి. ఆమె తన కుమార్తెతో కలిసి ఇంట్లో ఉంటోంది. తాజాగా ఆమె ఇంటి ఎలక్ట్రిక్ స్మార్ట్ మీటర్‌కు ఒక్కరోజు రీడింగ్ రూ.37 లక్షలు వచ్చింది. ఈ విషయంపై సదరు విద్యుత్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. కరెంటు బిల్లు పరిమితంగా వచ్చేలా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విద్యుత్ సంస్థ పేర్కొంది. ఫలితంగా వారి ఇంటికి సాధారణంగా కరెంటు బిల్లు దాదాపు 160 రూపాయలు వస్తుంటుంది. వారి ఇంటి విద్యుత్ మీటర్‌లో పొరపాటు జరిగిందని బ్రిటన్‌కు చెందిన విద్యుత్‌ సంస్థ ‘ఓవో ఎనర్జీ’ అంగీకరించింది.


కాగా ఈ బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు, బిల్లు మొత్తం లక్షల్లో ఉండటంతో హడలిపోయానని తెలిపింది. చోలే మీడియాతో మాట్లాడుతూ 'తాము రాత్రంతా లైట్లు ఆఫ్ చేసి నిద్రపోతామని, పగటిపూట కూడా అన్ని లైట్లు వేసుకోమని ఆమె తెలిపింది. ఈ బిల్లు చూడగానే ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయని, గుండెపోటు వచ్చినట్లు అనిపించిందని, ఏం జరుగుతోందో తెలియలేదని చోలే పేర్కొంది. ఈ విషయంపై విద్యుత్‌ సంస్థ ప్రతినిధి స్ప‌ష్ట‌త‌నిస్తూ.. విద్యుత్ బిల్లులో పొరపాటు జరిగిందని, దానిని సరిద్దామని తెలిపారు. ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీటిని వెంటనే సరిదిద్దుతామని వివరించారు. 

Read more