ఇంట్లో కూర్చునే నెలకు రూ.1.50 లక్షల సంపాదన.. పాడు పనులు చేస్తున్నాడేమోనని ఈ 22 ఏళ్ల కొడుకును తల్లిదండ్రులు నిలదీస్తే..

ABN , First Publish Date - 2022-05-26T17:59:05+05:30 IST

ప్రస్తుతం దేశంలో దాదాపు 75 కోట్ల మందికి పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

ఇంట్లో కూర్చునే నెలకు రూ.1.50 లక్షల సంపాదన.. పాడు పనులు చేస్తున్నాడేమోనని ఈ 22 ఏళ్ల కొడుకును తల్లిదండ్రులు నిలదీస్తే..

ప్రస్తుతం దేశంలో దాదాపు 75 కోట్ల మందికి పైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వారిలో దాదాపు 23 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యే వారు ఉన్నారు. ఇంతకుముందు పేపర్లలో, టీవీల్లో కార్టూన్‌లు, జోక్‌లు చూసి నవ్వుకునేవాళ్లం. ఇప్పుడు వాటిని రీల్స్‌, మీమ్స్‌ భర్తీ చేశాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మీమ్స్, రీల్స్ తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి నవ్వుకుని స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తుంటాం. అయితే ఇలాంటి మీమ్‌లు సృష్టించేవారి సంపాదన నెలకు లక్షల్లో ఉంటుందని మీకు తెలుసా? 


ఇది కూడా చదవండి..

రూ.200 పెట్టుబడి పెడితే.. రూ.8.80 లక్షల లాభం.. ఒక్కరోజులోనే ఈ మహిళ జీవితం ఎలా మారిపోయిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన సత్యం చతుర్వేది వయస్సు సుమారు 21 సంవత్సరాలు. పేద కుటుంబానికి చెందిన సత్యం డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయాడు. ఐయేఎస్ కావాలనుకుని కోచింగ్‌కు డబ్బుల్లేక ఆశలు వదులుకున్నాడు. చివరకు 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మీమ్ పేజీని సృష్టించాడు. తరచుగా మీమ్‌లు తయారు చేసి ఆ పేజీలో పోస్ట్ చేస్తుండేవాడు. ప్రారంభంలో అతని స్నేహితులు ఎగతాళి చేసేవారు. ఏ పనీ చేయకుండా టైమ్ పాస్ చేస్తున్నాడని తిట్టేవారు. అయినా సత్యం నిరాశపడకుండా తన పని మీదే దృష్టి సారించాడు. అతని తొలి సంపాదన రూ.120 రూపాయలు. మెల్లిగా అతని అకౌంట్‌కు ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం సత్యం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య పది లక్షలను దాటింది.    కేవలం 21 ఏళ్ల వయస్సు కలిగిన సత్యం ప్రస్తుతం నెలకు దాదాపు రూ. 1.50 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అతని పేజీలో యాడ్‌లు పెట్టేందుకు పలు ఓటీటీ సంస్థలు, ప్రకటన సంస్థలు ముందుకు వస్తున్నాయి. సత్యం మెల్లమెల్లగా ఎదగడం మొదలుపెట్టాక ఊర్లో వాళ్లు అతడి గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించారు. కొడుకు ఏదో తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడని కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత మొత్తం విషయం తెలుసుకుని చాలా సంతోషంగా ఫీలయ్యారు. ఇప్పటివరకు తను సంపాదించిన డబ్బుతో సత్యం తన గ్రామంలో నెల రోజుల క్రితం ఓ ప్లే స్కూల్ కూడా ప్రారంభించాడు. 

Read more