జాబ్ చేస్తూ లా చదువుతున్న కుర్రాడు.. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో Gay Relationship.. చివరకు ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-04T22:27:26+05:30 IST

ఆ కుర్రాడు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పనిచేసేవాడు.. ఉద్యోగం చేస్తూనే లా చదువుకునేవాడు.

జాబ్ చేస్తూ లా చదువుతున్న కుర్రాడు.. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో Gay Relationship.. చివరకు ఎంత పని జరిగిందంటే..

ఆ కుర్రాడు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పనిచేసేవాడు.. ఉద్యోగం చేస్తూనే లా చదువుకునేవాడు.. కొద్ది రోజుల క్రితం అతడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. స్వలింగ సంపర్కుడైన అతడితో రిలేషన్ షిప్ ప్రారంభించాడు.. గే గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు.. అయితే వారి మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ముగ్గురు వ్యక్తులు అతడిని చంపేసి డ్రైనేజ్‌లో పడేశారు.. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి..

భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు.. కంగారుగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆమె ఫోన్‌కాల్ డేటాను చెక్ చేస్తే..


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన యష్ రస్తోగి  అనే యువకుడు  జీఎస్టీ ఆదాయపు పన్ను శాఖలో పని చేసేవాడు. ఉద్యోగంతో పాటు కాలేజీలో ఎల్‌ఎల్‌బీ కూడా చదువుతున్నాడు. అతనికి కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్ ద్వారా సావేజ్ అన్సారీతో పరిచయం ఏర్పడింది.  ఆ తర్వాత ఇద్దరూ ఫేస్‌బుక్ స్నేహితులు అయ్యారు. సావేజ్ అప్పటికే స్వలింగ సంపర్కుల గ్యాంగ్‌ను నడిపేవాడు. అందులో యశ్ కూడా చేరాడు.  ఆ క్రమంలో యశ్ తన న్యూడ్ వీడియో తీశాడని సావేజ్ అనుమానించడం ప్రారంభించాడు. ఆ విషయాన్ని సావేజ్ తన స్నేహితులు సల్మాన్, అలీజాన్‌లకు చెప్పాడు. 


ఆ ముగ్గురు కలిసి జూన్ 26 సాయంత్రం యశ్‌ను ఓ ఫ్యాక్టరీకి పిలిచారు. స్కూటీ మీద యశ్ అక్కడికి చేరుకున్నాడు. యశ్‌తో ఆ ముగ్గురు వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో ముగ్గురు కలిసి యశ్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి రాత్రి సమయంలో ఓ డ్రైనేజీ కాలువలో పడేశారు. యశ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి యశ్ కోసం వెతికారు. లిసాడిగేట్‌ ప్రాంతంలో యశ్ మొబైల్ లొకేషన్ లభ్యమైంది. ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దాని ద్వారా నిందితులు ముగ్గురినీ గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు. 

Read more