-
-
Home » Prathyekam » 18 year old girl fell in love with 78 year old man Philippines prvn spl-MRGS-Prathyekam
-
Viral News: 78ఏళ్ల వృద్ధుడితో 18 ఏళ్ల యువతి ప్రేమ వివాహం!
ABN , First Publish Date - 2022-10-05T13:18:32+05:30 IST
అతడికి 78 సంవత్సరాలు. ఆమె వయసు 18ఏళ్లు. కుటుంబ సభ్యుల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో.. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 78 సంవత్సరాలు. ఆమె వయసు 18ఏళ్లు. కుటుంబ సభ్యుల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో.. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వినడానికి షాకింగ్‌గా అనిపించినా ఇది నిజం. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? మనవరాలు వయసు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకున్న వ్యక్తి ఎవరు? వంటి విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రేమ గుడ్డిది. అది ఎప్పుడు, ఎక్కడ.. ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. వంటి తెలుగు సినిమా డైలాగులను ఎక్కడైనా వినిందో ఏమో తెలియదు కానీ హలీమా అబ్దుల్లా( Halima Abdullah) అనే యువతి 78ఏళ్ల రషద్ మంగాకోప్(Rashad Mangakop) అనే వృద్ధుడిని చూసి మనసు పారేసుకుంది. తన మనసులో మాట అతడికి చెప్పి ఒప్పించింది. అనంతరం మూడేళ్లపాటు ఈ జంట.. ప్రేమాయణం సాగించారు. తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంతో(18 years girl marries 78 year old man) ఒక్కటైంది.
ఈ సందర్భంగా రషద్ మంగాకోప్ సోదరుడి కూతురు మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం జరిగిన ఓ పార్టీలో రషద్ మంగాకోప్.. హలీమా అబ్దుల్లా ఒకరునొకరు కలుసుకున్నట్టు చెప్పింది. ఈ క్రమంలోనే రషద్‌ను మంగాకోప్‌ను హలీమా అబ్దుల్లా ఇష్టపడినట్టు తెలిపింది. ఆ తర్వాత రషద్ మంగాకోప్ కూడా ఆమెను ప్రేమించినట్టు వెల్లడించింది. మూడేళ్ల ప్రేమాయణం తర్వాత ఆగస్ట్ 25న వివాహం చేసుకున్నట్టు వివరించింది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. రషద్ మంగాకోప్‌కు హలీమా అబ్దుల్లాతో జరిగిన పెళ్లే తొలి వివాహమట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. ‘నేను నా జీవితంలో హలీమా అబ్దుల్లాను తప్ప ఏ అమ్మాయిని ప్రేమించలేదు. పెళ్లి కూడా చేసుకోలేదు’ అని పేర్కొన్నాడు. ఇంతకూ ఈ వివాహం ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ. ఈ ప్రేమ పెళ్లి ఫిలిప్పీన్స్(Philippines)లో చోటు చేసుకుంది. అక్కడి చట్టాల ప్రకారం.. 21సంవత్సరాలలోపు వయసున్న యువతి, యువకుడు తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ వివాహానికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.