చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఏం జరిగిందో చూడండి.. 15 నెలల చెల్లిని 5 ఏళ్ల బాలుడికి అప్పగించి ఇంట్లో అంతా పనికి వెళ్తే..

ABN , First Publish Date - 2022-09-29T21:40:22+05:30 IST

పాప అప్పటికే చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు.

చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఏం జరిగిందో చూడండి.. 15 నెలల చెల్లిని 5 ఏళ్ల బాలుడికి అప్పగించి ఇంట్లో అంతా పనికి వెళ్తే..ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే సరైన విశ్రాంతి ఉండదు తల్లిదండ్రులకు. ఎవరో ఒకరు పిల్లల కదలికల మీద కన్నేసి ఉంచుతారు. పిల్లలను చూసుకోవడం తల్లిదండ్రులకు కుదరకపోతే పెద్దవాళ్ళనో, పనిమనుషులనో పిల్లలకు తోడుగా ఉంచుతారు. అది కుడా సాధ్యం కాకపోతే బేబి కేర్ సెంటర్ లో పిల్లలను వదిలి ఉద్యోగాలకు పనులకు వెళతారు. అయితే ఇదంతా డబ్బు బాగా ఉన్నవాళ్ళ సంగతి. డబ్బు లేనివాళ్ళు ఖచ్చితంగా పనులకు ఇంటిల్లిపాది వెళ్ళాలి కాబట్టి వారు పిల్లలకోసం ఏదో ఒక మార్గం చూసుకుని పనులకు వెళ్ళిపోతారు. 


రాజస్థాన్ లోని ఖర్గోన్ జిల్లా బెజాపూర్ గ్రామంలో 15 నెలల పాపని ఆ పాప తల్లిదండ్రులు 5 సంవత్సరాల వారి కొడుకు దగ్గర వదిలి పనులకు వెళ్ళిపోయారు. ఆ పాప అన్నయ్య పాపని గమనించుకోలేదు, ఆ పాప ఆడుకుంటూ వెళ్ళి నీటి టబ్ లో పడింది. టబ్ లో నీళ్ళు నిండుగా ఉండటంతో  ఊపిరి ఆడక చనిపోయింది. సాయంత్రం పనుల నుండి వచ్చిన తరువాత పాప కోసం చూసినపుడు నీళ్ళలో మునిగిపోయి కనిపించడంతో  పాప తండ్రి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు. అయితే పాప అప్పటికే చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నీటిలో ఊపిరాడక చనిపోవడమే కారణమని తెలియడంతో పోలీసులు పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. బోసినవ్వుల ఆ పసిపాప తల్లిదండ్రులకు బాధను మిగిల్చి వెళ్ళిపోయింది.


 ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లడం వల్ల జరిగిన ఘోరమిది.. ఆ అయిదేళ్ల బాబుకు కూడా పూర్తి అవగాహన లేక ఆట్లాడుకుంటూ ఉండగా జరిగిన దారుణమిది. ఏదిఏమైనా ఆ తల్లి చేసిన ఒక్క తప్పిదం వల్ల.. ఆమెకు గర్భశోకం మిగిల్చింది.

Read more