14 Year Old Girl Abortion Case: నాకీ గర్భం వద్దు.. తీసేయించుకుంటానన్న 14 ఏళ్ల బాలిక.. హైకోర్టు తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-23T21:21:53+05:30 IST

ఆ 14 ఏళ్ల బాలికను ఆమె స్వంత బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు..

14 Year Old Girl Abortion Case: నాకీ గర్భం వద్దు.. తీసేయించుకుంటానన్న 14 ఏళ్ల బాలిక.. హైకోర్టు తీర్పు ఏంటంటే..

ఆ 14 ఏళ్ల బాలికను ఆమె స్వంత బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.. పలుసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది.. దీంతో అత్యాచారం ఉదంతం తెరపైకి వచ్చింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. అయితే అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు ఆ బాలిక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది.. వైద్యులు నిరాకరించడంతో ఆ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది.. కేసు విచారించిన హైకోర్టు ఆ బాలిక అబార్షన్‌(Abortion) కు అనుమతినిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Newlywed Woman: భవిష్యత్ గురించి ఈ 19 ఏళ్ల యువతి ఎన్ని కలలు కని ఉంటుందో.. కానీ పెళ్లయిన 7 నెలలకే ఇలా జరిగిందేంటి..!


స్వంత బంధువు నమ్మించి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన బాలిక దానిని తీయించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. చివరకు ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు (Chhattisgarh High Court)ను ఆశ్రయించింది. కోర్టు ఆమెకు వైద్య పరీక్ష చేయించింది. ప్రస్తుతం ఆ బాలిక 27 వారాల గర్భవతి. సీఐ‌ఎమ్ఎస్ (Chhattisgarh Institute of Medical Sciences) వైద్యుల పర్యవేక్షణలో ఈ అబార్షన్ జరగాలని హై కోర్టు సూచించింది. బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జాగ్రత్తగా అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది. 


ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక విచారణను నిర్వహించిన హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ పి.సామ్ కోషి.. బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని సీఐ‌ఎమ్ఎస్ వైద్యులను  కోరారు. వైద్యులు బాలికను పరీక్షించి 27 వారాల గర్భాన్ని తొలగించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఆ వైద్య నివేదిక ఆధారంగా బాలిక అబార్షన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాలతో గర్భిణికి, కుటుంబానికి పెద్ద ఊరట లభించింది.


Updated Date - 2022-07-23T21:21:53+05:30 IST