Shocking: కాలిని పట్టుకుని వదలని 11 ఏళ్ల పిల్లాడు.. దొరికిపోతానన్న భయంతో చితకబాదిన దొంగ.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-28T01:17:03+05:30 IST

పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దొంగను అడ్డుకోబోయిన ఓ చిన్నారిని ఆ దొంగ రాడ్‌తో కొట్టి పారిపోయాడు.

Shocking: కాలిని పట్టుకుని వదలని 11 ఏళ్ల పిల్లాడు.. దొరికిపోతానన్న భయంతో చితకబాదిన దొంగ.. చివరకు..

జైపూర్: పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ప్రమాదకరం. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటారు. ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దొంగను అడ్డుకోబోయిన ఓ చిన్నారిని(Kid) ఆ దొంగ రాడ్‌తో కొట్టి పారిపోయాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ  ఘటన ఇటీవల రాజస్థాన్‌లోని(Rajasthan) జైపూర్‌లో(Jaipur) చోటుచేసుకుంది. 


స్థానిక హరీనగర్ గోకుల్‌పురాలో నివసించే సత్యేంద్ర శర్మ జ్యోతిష్యం చెబుతుంటారు. ఆయన భార్య స్వాతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్. వారికి దేవాంశ్(11), దివ్య(7) అని ఇద్దరు పిల్లలున్నారు. ఇక పెస్టెంబర్ 22న స్వాతీకి బీఎడ్ పరీక్ష ఉండటంతో.. సత్యేంద్ర శర్మ ఆమెను ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగబెట్టేందుకు వెళ్లారు. పిల్లల్ని ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లారు. మధ్యహ్నం సుమారు 3.00 గంటలకు ఆ ఇంట్లోకి ఓ దొంగ(Thief) కాలుపెట్టాడు. పెద్దలెవరూ లేరని గుర్తించే అతడు ఇంట్లోకి వచ్చే సాహసం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. అప్పటికి దేవాంశ్ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. దివ్య లోపల గదిలో నిద్రపోతోంది. దొంగ ఇంట్లోకి రావడాన్ని గమనించిన దేవాంశ్ పెద్దపెట్టున అరిచాడు. 


దొంగ పారిపోయేందుకు ప్రయత్నించగా..  దేవాంశ్ అతడి కాళ్లకు చుట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.  పెద్దఎట్టున అరిచి చుట్టుపక్కల వారిని అలర్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆ దొంగ దేవాంశ్‌ను రాడ్‌తో ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఈ పెనుగులాటలో దేవాంశ్‌కు కొన్ని చోట్ల దెబ్బలు తగిలినా ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇరుగు పొరుగు వారు అతడి కోసం వెతికినా ఉపయోగం లేకపోయింది. కాగా.. స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించి అతడి తండ్రికి సమాచారం అందించారు. ఇక బిడ్డ క్షేమంగా ఉన్నాడని వైద్యలు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-09-28T01:17:03+05:30 IST