Viral News: చదివింది పదో తరగతి మాత్రమే.. కానీ ఈ ఒక్క పనితో నెలకు రూ.25లక్షలు.. ఏడాదికి రూ.3 కోట్ల సంపాదన..!

ABN , First Publish Date - 2022-07-29T16:53:47+05:30 IST

కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలనో లేక ఇతర కారణాల వల్లో అతడు కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కానీ ఒకే ఒక్క ఘటనతో అతడితో జీవితం మారిపోయింది. ఉన్నత చదువులు చదివి.. కార్పోరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ధీ

Viral News: చదివింది పదో తరగతి మాత్రమే.. కానీ ఈ ఒక్క పనితో నెలకు రూ.25లక్షలు.. ఏడాదికి రూ.3 కోట్ల సంపాదన..!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలనో లేక ఇతర కారణాల వల్లో అతడు కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కానీ ఒకే ఒక్క ఘటనతో అతడితో జీవితం మారిపోయింది. ఉన్నత చదువులు చదివి.. కార్పోరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ధీటుగా.. ఇంకా చెప్పాలంటే అందరూ ఆశ్చర్యపడేలా సంపాదిస్తున్నాడు. ఒకే ఒక్క పనితో నెలకు రూ.25 లక్షల చొప్పున ఏడాదికి రూ.3కోట్లు ఆర్జిస్తూ ఔరా! అనిపిస్తున్నాడు. చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాగా.. ఇంతకూ అతడు ఎవరు? ఏడాదికి రూ.3కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..



రాజస్థాన్‌(​​Rajasthan)‌కు చెందిన కెహ్రారామ్ (Kehraram) అనే వ్యక్తి మార్వర్ ప్రాంతంలో గల మారుమూల గ్రామంలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. వ్యవసాయం(Farming) ద్వారా ఈయన ఏడాదికి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ చుట్టు పక్కల వారికి ఆదర్శంగా నిలిస్తున్నాడు. నాలుగు హెక్టార్ల పొలంలో సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా దేశాలకు చెందిన మెడ్జూల్(Medjool), బారి(Bari) రకం ఖర్జూరలను పండిస్తూ భారీ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. ఈ పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నందున నష్టాల ప్రస్తకే ఉండదని చెబుతున్నారు. జీడిపప్పు, బాదాం, వాల్ నట్స్ కంటే ఈ ఖర్జూరల ధర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. వీటితో ఇతర పండ్లను కూడా పండిస్తానని అస్తారట. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నందున మంచి లాభాలు వస్తున్నాయని.. ఈ క్రమంలోనే ఏడాదికి సుమారు రూ.3కోట్లు సంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. 2012లో వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌లో వెళ్లి.. ఖర్జూర(Dates) లను పండించడం నేర్చుకున్నట్టు వివరించారు. ఒక్క ఖర్జూర మొక్కకు రూ.3,500 వెచ్చించి నాలుగు హెక్టార్లకు సరిపడా మొక్కలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం 90శాతం రాయితీ కూడా ఇచ్చిందని చెప్పారు. 


Updated Date - 2022-07-29T16:53:47+05:30 IST