వందేళ్లకు పైబడిన వయసు.. 80 ఏళ్ల వైవాహిక జీవితం.. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే..

ABN , First Publish Date - 2022-04-24T17:54:44+05:30 IST

అతని వయసు 105 సంవత్సరాలు.. ఆమె వయసు 101 సంవత్సరాలు.. ఇద్దరిదీ 80 ఏళ్ల వైవాహిక జీవితం..

వందేళ్లకు పైబడిన వయసు.. 80 ఏళ్ల వైవాహిక జీవితం.. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే..

అతని వయసు 105 సంవత్సరాలు.. ఆమె వయసు 101 సంవత్సరాలు.. ఇద్దరిదీ 80 ఏళ్ల వైవాహిక జీవితం.. గురువారం రాత్రి అతను కన్నుమూశాడు.. తీవ్ర విషాదానికి గురైన భార్య.. భర్త చనిపోయిన ఐదు గంటల్లోనే కన్నుమూసింది.. ఇద్దరినీ ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు.. వారి మరణం గ్రామంలో ఎందరినో కదిలించింది.


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వృద్ధ దంపతులు భైరు సింగ్ (105), హిరి దేవి (101) మధ్య ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భైరు సింగ్ కన్నుమూశాడు. 80 ఏళ్లు తనతో పాటు జీవనం సాగించిన భర్త దూరం కావడంతో హిరి దేవి కుంగిపోయింది. తీవ్ర విషాదానికి గురై రాత్రి 9 గంటలకు కన్నుమూసింది. దీంతో వారి మృతదేహాలను ఒకే చితిపై ఉంచి 70 ఏళ్ల కొడుకు అంత్యక్రియలు నిర్వహించాడు. 


వారి అంత్యక్రియలకు స్వగ్రామం వారే కాకుండా.. చుట్టు పక్కల గ్రామాల వారు కూడా హాజరయ్యారు. భార్యభర్తల మధ్య ప్రేమను కొనియాడారు. వారి దాంపత్య జీవితాన్ని ప్రశంసించారు. వందేళ్లు పైబడ్డాక కూడా వారిద్దరూ తమ పనులు తామే చేసుకునే వారని, ఎవరి మీదా ఆధారపడకుండా చివరి వరకు గడిపారని గుర్తు చేసుకున్నారు. 

Read more