YCP: ఆ ఇద్దరితో వైసీపీలో వణుకు!

ABN , First Publish Date - 2022-12-06T20:59:53+05:30 IST

మొత్తానికి వైసీపీ (YCP) సినిమా ప్రారంభమైంది. అథమ స్థాయి భాషతో రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లుతున్న అధికార పక్షానికి జనసేనాని అదే భాషతో సమాధానం చెప్పిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

YCP: ఆ ఇద్దరితో వైసీపీలో వణుకు!

అమరావతి: మొత్తానికి వైసీపీ (YCP) సినిమా ప్రారంభమైంది. అథమ స్థాయి భాషతో రాజకీయ కాలుష్యాన్ని వెదజల్లుతున్న అధికార పక్షానికి జనసేనాని అదే భాషతో సమాధానం చెప్పిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వ్యూహాలు మార్చుకుంటానంటూ పవన్ కుండబద్ధలు కొట్టగానే వైసీపీ నేతలు ఎప్పటిలానే తమ వాచాలతను దాచుకోలేకపోయారు. పెర్నినాని, గుడివాడ అమర్నాథ్ మరోసారి పవన్‌పై పాచిపాటలే పాడారు. మొత్తానికి ఏపీలో తమకు ఎదురే లేదు అనుకుంటూ పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్న వైసీపీకి పవన్ కల్యాణ్ అతిపెద్ద వార్నింగ్ బేల్ మోగించారు.

ఇటీవల కాలంలో ఏపీలో టీడీపీ (TDP), జనసేన (JANASENA) కలిసి పోటీ చేయాలని భావించే వారి సంఖ్య అనుహ్యంగా పెరుగుతోంది. 2014 సీన్ రిపీట్ కావాలంటే జనసేన, టీడీపీ మద్దతు ఇవ్వాలనే సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తున్నాయి. మరో పక్క రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ విశాఖలో నిర్బంధం తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారు. తనలోని హావేశాన్ని బయటకు తీశారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే తీరుతోనే ఆయన కూడా కొడుకు భాషను ప్రయోగించారు. పవన్ ఆవేశంగా మాట్లాడుతారు కానీ ఎప్పుడు గౌరవప్రధమైన భాషను వాడేవారు. కానీ మంచితనం, గౌరవం పాలక పక్షంలో డిక్షనరీలో లేవని పవన్ భావించినట్లు ఉన్నారు. అందుకే వారి ఎలా చెబితే అర్ధమవుతోందో అలాగే చెప్పారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలి నుంచి జనసేన, టీడీపీ కలవకుడదన్నదే వైసీపీ ప్లాన్.

Updated Date - 2022-12-06T21:11:47+05:30 IST