Kuwait-New York Flight: విమానంలో చిన్నారికి జన్మనిచ్చిన మహిళ!

ABN , First Publish Date - 2022-08-22T19:11:13+05:30 IST

ఓ మహిళ విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కువైత్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న కువైత్ ఎయిర్‌వేస్ విమానం కేయూ117లో ప్రయాణిస్తున్న గర్భణికి అకస్మాత్తుగా పురుటి నొప్పులు మొదలయ్యాయి.

Kuwait-New York Flight: విమానంలో చిన్నారికి జన్మనిచ్చిన మహిళ!

ఎన్నారై డెస్క్: ఓ మహిళ విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. కువైత్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న(Kuwait-New York Flight) కువైత్ ఎయిర్‌వేస్(kuwait airways) విమానం కేయూ117లో ప్రయాణిస్తున్న గర్భణికి అకస్మాత్తుగా పురుటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ మహిళకు పురుడు పోశారు. ఈ విషయాన్ని కువైత్ ఎయిర్‌వేస్ ప్రతినిధులు ధ్రువీకరించారు. మార్గమధ్యంలో మహిళకు నొప్పులు మొదలవడంతో.. సిబ్బందే ఆమెకు పురుడు పోసినట్టు(woman delivered baby) వెల్లడించారు. ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులను అయినా ఎదుర్కొనగలిగేలా శిక్షణ ఇచ్చినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. కువైత్ ఎయిర్‌వేస్ ఇలా జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఆగస్ట్ 2న కువైత్-ఫిలిప్పీన్స్ విమానంలో బిడ్డకు జన్మనిచ్చింది.


Read more