America: 37ఏళ్ల అమెరికన్‌కు.. హిందూ మహిళలే టార్గెట్.. ఏం చేసేవాడంటే..

ABN , First Publish Date - 2022-10-07T02:05:31+05:30 IST

పండుగలు, వేడుకల సందర్భంగా హిందూ మహిళలు బంగారు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబవుతుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇలా విలువైన ఆభరణాలను అలంకరించుకున్న మహిళలే టార్గెట్‌గా 37ఏళ్ల అమెరికన్ రెచ్చిపోయాడు. సు

America: 37ఏళ్ల అమెరికన్‌కు.. హిందూ మహిళలే టార్గెట్.. ఏం చేసేవాడంటే..

ఎన్నారై డెస్క్: పండుగలు, వేడుకల సందర్భంగా హిందూ మహిళలు బంగారు ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబవుతుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇలా విలువైన ఆభరణాలను అలంకరించుకున్న మహిళలే టార్గెట్‌గా 37ఏళ్ల అమెరికన్ రెచ్చిపోయాడు. సుమారు రెండు నెలలపాటు భయాందోళనలకు గురి చేశాడు. అయితే.. చివరికి అతడి పాపం పండింది. అతడి విషయంలో స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కాలిఫోర్నియాకు చెందిన లథాన్ జాన్సన్.. ఈస్ట్ పాలో ఆల్టో అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు విలువైన ఆభరణాలు ధరించిన హిందూ మహిళలను టార్గెట్‌గా చేసుకుని రెండు నెలలుగా దాడులకు పాల్పడుతున్నాడు. భర్తలను చితక్కొట్టి.. మహిళల ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుంటున్నాడు. రెండు నెలల కాలంలో ఇలా సుమారు 15 మంది మహిళల వద్ద ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీంతో ఆ ప్రాంతంలోని భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. జాన్సన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్‌కు అవకాశం లేకుండా జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 


Updated Date - 2022-10-07T02:05:31+05:30 IST