సౌదీ కంపెనీ నిర్బంధంలో ఉన్న భారతీయ కార్మికుడికి ఎట్టకేలకు విముక్తి!

ABN , First Publish Date - 2022-07-17T03:28:10+05:30 IST

సౌదీ అరేబియాలోని భారతీయ ఎంబసీ కృషి ఫలితంగా ఓ భారతీయుడికి ఎట్టకేలకు స్వేఛ్చ లభించింది.

సౌదీ కంపెనీ నిర్బంధంలో ఉన్న భారతీయ కార్మికుడికి ఎట్టకేలకు విముక్తి!

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియాలోని(Saudi arabia) భారతీయ ఎంబసీ కృషి ఫలితంగా ఓ భారతీయుడికి(Expat worker) ఎట్టకేలకు స్వేఛ్చ లభించింది. సౌదీ యజమాని నిర్బంధంలో ఉన్న అతడు ఇటీవల క్షేమంగా భారత్‌కు చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌పూర్ గ్రామానికి చెందిన రాకేశ్ ఉపాధ్యాయ్ ప్లంబింగ్ పని చేస్తుంటాడు. 2019లో సౌదీకి వెళ్లాడు. అక్కడ ఓ సంస్థలో రెండేళ్ల కాంట్రాక్టుపై ఓ సంస్థలో చేరాడు. కాంట్రాక్ట్‌  పూర్తైన తరువాత సంస్థ అతడికి జీతాన్ని నిలిపివేసింది. 


అంతేకాకుండా.. రాకేశ్ పాస్‌పోర్టును కూడా అతడికి తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో.. వారు స్థానిక పోలీసుల సాయంతో సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ్యాన్ని సంప్రదించారు. దీంతో.. రంగంలోని దిగిన సిబ్బంది సౌదీ కంపెనీ ప్రతినిధులను పిలిపించుకుని ప్రశ్నించారు. దీంతో.. కంపెనీ వారు రాకేశ్‌కు ఏడాదిగా బాకీపడ్డ జీతాన్ని చెల్లించడమే కాకుండా అతడి పాస్‌పోర్టు కూడా తిరిగిచ్చారు. దీంతో..రాకేశ్ ఇటీవలే స్వగ్రామానికి చేరుకున్నాడు. క్షేమంగా తిరిగిచ్చిన రాకేశ్‌ను చూసి అతడి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

Read more